ఆసియా క్రికెట్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్‌లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచన పాకిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకుంది. దీంతో క్రీజ్‌లోకి వచ్చిన సాహిబ్ జాదా ఫర్హాన్ - సయిమ్ అయూబ్‌లు ఓపెనర్లుగా క్రీజ్‌లోకి అడుగు పెట్టగా హార్దిక్ పాండ్యా భారత్ తరపున బౌలింగ్ ప్రారంభించాడు.
అయితే, ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా దాయాది దేశానికి గట్టి షాక్ ఇచ్చాడు. తొలి బంతికే ఓపెనర్ సయిమ్ అయూబ్‌ను డకౌట్ చేశాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతని స్థానంలో మహ్మద్ హారిస్ ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. పాకిస్థాన్ జట్టు తొలి ఓవర్‌లో వికెట్ నష్టానికి 5 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తుది జాబితా ఇదే...
భారత జట్టు : అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాకిస్థాన్ జట్టు : సాహిబ్ జాదా ఫర్హాన్, సయిమ్ అయూబ్, మహ్మద్ హరీస్, ఫకర్ జమాన్, సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షహీన్ అఫ్రిద్, సుఫియాన్ ముఖీమ్, అబ్రాన్ అహ్మద్.