Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆసియా కప్ ఆట మొదలైంది.. తొలి మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ - హాంకాంగ్

Advertiesment
asia cup

ఠాగూర్

, మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (11:52 IST)
ఆసియా కప్ క్రికెట్ టోర్నీ 2025 పోటీలు మంగళవారం నుంచి మొదలయ్యాయి. టీ20 ప్రపంచకప్ ముందు జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్, ఈ రోజు నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా మరోసారి టైటిల్‌పై కన్నేసింది.
 
ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీలో మొత్తం ఎనిమిది ఆసియా జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ తలపడనున్నాయి.
 
టోర్నమెంట్లో భాగంగా మంగళవారం అబుదాబి వేదికగా ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను బుధవారం యూఏఈతో ఆడనుంది. ఇక యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న భారత్- పాకిస్థాన్ హైవోల్టేజ్ మ్యాచ్ ఈ నెల 14న జరుగనుంది. భారత అభిమానులను దృష్టిలో ఉంచుకుని, దాదాపు అన్ని మ్యాచ్‌లను రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యేలా ఏసీసీ షెడ్యూల్ చేసింది. సెప్టెంబర్ 28న దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ ఈ టోర్నీ ముగియనుంది.
 
భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, జస్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్. 
 
రిజర్వ్ ప్లేయర్లు: ప్రసిద్ధ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2025 ఆసియా కప్‌ గెలిచిన పురుషుల హాకీ జట్టు.. తెలుగు సీఎంల అభినందనలు