Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Asia Cup: ఆసియా కప్ కోసం 20వ తేదీన జట్టు ఎంపిక- బుమ్రా ఎంట్రీ ఇస్తాడా?

Advertiesment
Asia Cup

సెల్వి

, మంగళవారం, 12 ఆగస్టు 2025 (15:22 IST)
Asia Cup
ఆసియా కప్ కోసం బీసీసీఐ సెలక్టర్లు జట్టును ఎంపిక చేయనున్నారు. జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఈ వారం చివర్లో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ ప్రాతిపదికన ఎంతమంది టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉన్నారనేది ఆరా తీస్తుంది. 
 
అనంతరం ఈ నెల 20వ తేదీన జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ సెప్టెంబర్ 9వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. దీనికి వేదిక. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది. 
 
ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. అన్నీ సవ్యంగా సాగితే.. భారత్- పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ లు ఉండొచ్చు.
 
ఇకపోతే.. ఆసియాకప్ 2025 టోర్నీకి ముందు టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఇంగ్లండ్ పర్యటనలో మూడు మ్యాచ్‌లే ఆడిన టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఆసియా కప్ 2025 టోర్నీ ఆడనున్నాడు. 
 
పనిభారం కారణంగా ఈ టోర్నీకి బుమ్రా దూరంగా ఉంటాడని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆసియాకప్ ఆడేందుకు బుమ్రా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బుమ్రా.. ఆసియా కప్ ఆడితే వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ నుంచి అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.
 
ప్రాథమిక జట్టు వివరాల అంచనా.. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్ బ్యాటర్), తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా లేదా ప్రసిద్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ లేదా జురెల్‌కు అవకాశం లభించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్షాబంధన్‌తో డేటింగ్ పుకార్లకు తెరదించిన జనాయ్ భోస్లే