Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రక్షాబంధన్‌తో డేటింగ్ పుకార్లకు తెరదించిన జనాయ్ భోస్లే

Advertiesment
zanai - siraj

ఠాగూర్

, ఆదివారం, 10 ఆగస్టు 2025 (13:09 IST)
భారత క్రికెట్ జట్టు స్టార్ పేస్ బౌలర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ మైదానంలో తన ప్రదర్శనతోనే కాకుండా, మైదానం బయట కూడా తన వ్యక్తిగత విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ప్రముఖ గాయని ఆశా భోస్లే మనవరాలు జనాయ్ భోస్లేతో రాఖీ పండుగను జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
గత కొంతకాలంగా సిరాజ్, జనాయ్ డేకింగ్‌లో ఉన్నట్టు పుకార్లు చక్కర్లు కొట్టాయి. వీటిపై వారిద్దరూ ఏనాడూ కామెంట్స్ చేయలేదు. అయితే, ఆ వదంతులకు తెరదించుతూ, తమ మధ్య ఉన్నది అన్నా చెల్లెలి బంధమేనని వారు ఈ రాఖీ పండుగతో స్పష్టం చేశారు. జనాయ్ ఆప్యాయంగా సిరాజు రాఖీ కడుతున్న వీడియోను సిరాజ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. సహచర క్రికెటర్ రిషబ్ పంత్ కూడా లవ్ ఎమోజీతో స్పందించి తన శుభాకాంక్షలు తెలిపాడు.
 
ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో సిరాజ్ అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించిన విషయం తెల్సిందే. మొత్తం 23 వికెట్లు పడగొట్టి, సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. స్టార్ పేసర్ జస్రీత్ బుమ్రా కేవలం మూడు టెస్టులకే పరిమితమైన నేపథ్యంలో, సిరాజ్ భారత బౌలింగ్ దాడికి నాయకత్వం వహించాడు. అతని నిలకడైన ప్రదర్శనతో భారత్ సిరీస్లు 2-2తో డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆటలోనే కాదు.. నాయకత్వంలోనూ టాప్.. అర్చన శంకర నారాయణన్ అదుర్స్.. ఈమె ఎవరు?