Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సౌతాఫ్రికా ఫాస్టౌ బౌలర్ #HBDRabada బర్త్‌డే స్పెషల్ (ప్రత్యేక కథనం)

సౌతాఫ్రికా ఫాస్టౌ బౌలర్ #HBDRabada బర్త్‌డే స్పెషల్ (ప్రత్యేక కథనం)
, మంగళవారం, 25 మే 2021 (12:09 IST)
సౌతాఫ్రికా క్రికెట్ జట్టులోని ఫాస్ట్ బౌలర్లలో కగిసో రబాడా ఒకరు. ఈయన తన 26వ పుట్టినరోజు వేడుకలను 25వ తేదీ మంగళవారం జరుపుకుంటున్నాడు. 25 మే 1995న జోహన్నెస్‌బర్గ్‌లో జన్మించిన రబాడా.. ప్రస్తుత ఫాంలో ఉన్న కొద్దిమంది బౌలర్లలో ఒకరు. రబాడా అలెన్ డొనాల్డ్, డేల్ స్టెయిన్ వంటి బౌలర్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తన క్రికెట్‌ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. 
 
కగిసో రబాడా తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 148 మ్యాచ్‌కు ఆడాడు. 45 టెస్టుల్లో 82 ఇన్నింగ్స్‌లో 23.36 యావరేజ్ తో 202 వికెట్లు తీశాడు. అలాగే, రబాడా 77 వన్డేల్లో 27.67 సగటుతో 119 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో నాలుగుసార్లు 6 సార్లు, 5 వికెట్లు 1 సార్లు తీసుకున్నాడు. 
 
అదేవిధంగా టీ20 ఇంటర్నేషనల్స్‌లో 26.41 సగటుతో 26 మ్యాచ్‌ల్లో 31 వికెట్లు పడగొట్టాడు. రబాడా 2014 నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 ఇంటర్నేషనల్‌తో కెరీర్‌లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ 2015 జూలైలో బంగ్లాదేశ్‌తో వన్డేలో అరంగేట్రం చేయడానికి రబాడాకు అవకాశం వచ్చినప్పుడు, అతను అపోనేంట్ జట్టును నీళ్ళు తాగించాడు. 
 
అలా ఆ తొలి వన్డేలో 6 వికెట్లతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. ఇది మాత్రమే కాదు, ఈ మ్యాచ్‌లో రబాడా హ్యాట్రిక్ సృష్టించాడు. అతను టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ తమీమ్ ఇక్బాల్, లైటన్ దాస్, బంగ్లాదేశ్ కు చెందిన మహముదుల్లాను సైతం ఔట్ చేశారు. అలా వన్డే అరంగేట్రంలో హ్యాట్రిక్ సాధించిన ప్రపంచంలో రెండో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. 
 
అలాగే 200 వికెట్లు తీసిన ఆసియాయేతర ఆటగాడుగా నిలిచాడు. రబాడా ఈ ఏడాది జనవరిలో 25 సంవత్సరాల 248 రోజుల వయసులో ఈ ఘనతను సాధించాడు. రబాడా 44 వ టెస్టులో 79 ఇన్నింగ్స్‌లలో 200 వికెట్లు పూర్తి చేశాడు. 40.8 స్ట్రైక్ రేట్‌తో 22.96 సగటుతో 200 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్ లో ఆయన ఢిల్లీ కాపిటల్స్ తరపున ఆడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాణా హత్యకేసు.. సుశీల్ కుమార్‌పై రైల్వే వేటు