Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

144 యేళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో... న్యూజిలాండ్ సరికొత్త రికార్డు

144 యేళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో... న్యూజిలాండ్ సరికొత్త రికార్డు
, మంగళవారం, 20 నవంబరు 2018 (17:15 IST)
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సరికొత్త రికార్డును నెలకొల్పింది. అలాగే, పాకిస్థాన్ జట్టు కూడా రికార్డు స్థాయి ఓటమిని మూటగట్టుకుంది. అయితే, కివీస్ జట్టు మాత్రం 144 యేళ్ల క్రికెట్ చరిత్రలో ఇంతకుముందెన్నడూలేని రికార్డును నమోదు చేసింది. ఆ రికార్డు వివరాలేంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
పాకిస్థాన్ - న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులోభాగంగా అబుదాబి వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ జట్టు చేతిలో 7 వికెట్లు ఉన్నప్పటికీ 46 పరుగులు చేయలేక చతికిలపడింది. అదేసమయంలో కేవలం 4 పరుగుల తేడాతో టెస్టు మ్యాచ్‌ను గెలుచుకున్న జట్టుగా కివీస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 
 
ఈమెల 16వ తేదీన ఇరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ జట్టు కేవలం 153 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ జట్టు 227 పరుగులు చేసింది. దీంతో పాక్ జట్టు 74 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించుకుంది. 
 
ఆ తర్వాత కివీస్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 249 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా పాకిస్థాన్ జట్టు ముంగిట కేవలం 175 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. 
 
కివీస్ బౌలర్‌ అజాజ్ పటేల్ విజృంభణతో పాకిస్థాన్ జట్టు 171 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా కివీస్ జట్టు 4 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఒక దశలో పాకిస్థాన్ విజయాన్ని 46 పరుగులు కావాల్సి ఉండగా, చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. దీంతో పాక్ జట్టు గెలుపు లాంఛనమేనని అందరూ భావించారు. 
 
కానీ, ఆజాద్ పటేల్ ఒక్కసారి జూలు విదల్చడంతో పాక్ వికెట్లు టపటపా పడిపోయాయి. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. చివరకు పాకిస్థాన్ జట్టు 171 పరుగులకే ఆలౌట్ కావడంతో కివీస్ జట్టు 144 యేళ్ళ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డును ఆజాద్‌కు అందజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ డిఫెండబుల్‌, దివాల్‌.. ద్రవిడ్ అరుదైన రికార్డ్.. ఏంటో తెలుసా?