ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు తొలిసారి అవకాశం లభించిన విషయం తెలిసిందే. బర్మింగ్‌హామ్ వేదికగా ఈనెల 28న ఈ గేమ్స్ ప్రారంభం కానున్నాయి.
పురుషుల క్రికెట్‌లో భాగంగా కోలాలంపూర్ వేదికగా జరిగిన 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిధ్యం లభించగా.. అందులో దక్షిణాఫ్రికా స్వర్ణ పతకం నెగ్గింది.
50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 16 జట్లు 4 గ్రూప్‌లుగా విభజింపబడి పోటీపడగా.. సఫారీలు స్వర్ణాన్ని, ఆసీస్ రజతాన్ని, కివీస్ కాంస్య పతకాన్ని గెలిచాయి. అప్పట్లో గ్రూప్-బిలో తలపడిన భారత్ గ్రూప్ దశలోనే (3 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే గెలుపు) నిష్క్రమించి ఓవరాల్‌గా 9వ స్థానంలో నిలిచింది.
నాటి టీమిండియాకు అజయ్ జడేజా సారధ్యం వహించగా.. అనిల్ కుంబ్లే వైస్ కెప్టెన్‌గా.. సచిన్, లక్ష్మణ్ కీలక ప్లేయర్లుగా ఉన్నారు. కీలక ప్లేయర్లు పాకిస్థాన్‌తో సహారా కప్ ఆడుతుండటంతో బీసీసీఐ రెండో జట్టును కామన్వెల్త్ గేమ్స్‌కు పంపింది. ఇకపోతే.. మహిళల క్రికెట్ ద్వారా కామన్వెల్త్‌లో అడుగుపెట్టబోతున్న టీమిండియా వుమెన్స్ టీమ్ ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి.