అజారుద్ధీన్ వార్: హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న బీసీసీఐ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడితో మాజీ క్రికెటర్ అజారుద్ధీన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హెచ్‌సీఏ లోగోతో వివేక్ తండ్రి వెంకటస్వామి పేరుతో టీ20 లీగ్ నిర్వహించడం నిబంధనలకు విర
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడితో మాజీ క్రికెటర్ అజారుద్ధీన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హెచ్‌సీఏ లోగోతో వివేక్ తండ్రి వెంకటస్వామి పేరుతో టీ20 లీగ్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమే అని, హెచ్‌సీఏ అందరిని పక్కదారి పట్టిస్తోందని అజారుద్ధీన్ మండిపడ్డారు. లోథా సిఫార్సుల విషయంలో హెచ్‌సీఏ తీరు సరైందికాదన్నారు.
ఈ వ్యవహారాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లానని.. అయితే ఇప్పటివరకు క్లియరెన్స్ రాలేదని అజారుద్ధీన్ ఆరోపించారు. కానీ హైకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. దీనిపై తాను బీసీపీఐకి నివేదిక పంపాను. కోర్టు ఆదేశాలను బయటకు రానీయకుండా హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ తప్పు చేశారు. చదువుకున్న వ‍్యక్తులు ఇలా ప్రవర్తించడం బాధాకరం. దీనిపై చట్టపరంగా ముందుకు వెళతా. తనకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేదన్నారు.హెచ్‌సీఏ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తనకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయితే, తనను ఓ సెలబ్రిటీగా అందరూ ఆహ్వానిస్తారని అన్నారు. కాగా, అజహరుద్దీన్.. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీసీసీఐ తాజాగా అనుమతిచ్చింది.