ముఖాలకు మాస్కులు-వరుసపెట్టి వాంతులు చేసుకున్న లంక క్రికెటర్లు
దేశ రాజధాని నగరంలో ఢిల్లీ వాయుకాలుష్యంలో మునిగిపోయింది. ఢిల్లీలో వున్న జనంతో పాటు విదేశాల నుంచి వస్తున్న పర్యాటకులు సైతం వాయు కాలుష్యంతో నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ టెస్టు మొదలైనప్పటి
దేశ రాజధాని నగరంలో ఢిల్లీ వాయుకాలుష్యంలో మునిగిపోయింది. ఢిల్లీలో వున్న జనంతో పాటు విదేశాల నుంచి వస్తున్న పర్యాటకులు సైతం వాయు కాలుష్యంతో నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ టెస్టు మొదలైనప్పటి నుంచి లంక క్రికెటర్లు వాయు కాలుష్యంతో వాంతులు చేసుకుంటున్నారు. కాలుష్యం దెబ్బకు తొలి రోజే ముఖాలకు మాస్కులు పెట్టుకున్నారు.
రెండో రోజు కడుపులో తిప్పేయడంతో పదే పదే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి వాంతులు చేసుకుని తిరిగి వచ్చారు. ఇక నాలుగో ఆట ప్రారంభం అయినప్పటి నుంచి గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రీలంక ఆటగాళ్లు వాంతులు చేసుకున్నారు. ఈ క్రమంలో లంక క్రికెటర్ లక్మల్ అనారోగ్యానికి గురైయ్యాడు.
మంగళవారం (డిసెంబర్-5) ఆటలో భారత్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే లక్మల్ ఇబ్బంది పడ్డాడు. లక్మల్ మూడు ఓవర్లు వేసిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఫీల్డ్‌ను వదిలి డ్రస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయాడు. లక్మల్ తోపాటు చండిమల్, ఏంజెలో మాథ్యూస్‌లు మాస్క్‌లు ధరించే ఫీల్డ్‌లోకి దిగారు.
అయినా లంక క్రికెటర్లు వరుసపెట్టి వాంతులు చేసుకోవడంతో.. కాలుష్యం కారణంగా మ్యాచ్‌ను ఆపేయాలని అంపైర్లు కోరారు. కానీ రిఫరీలు అంగీకరించలేదు. దీంతో వేరే దారిలేక లంక క్రికెటర్లు ఆడుతున్నారు. మొహాలకు మాస్కులతో లంక క్రికెటర్లు ఆడటంతో బీసీసీఐ పరువు గాల్లో కలిసిపోయింది. ఇకపై శీతాకాలంలో ఢిల్లీలో క్రికెట్ సిరీస్ నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.