ఢిల్లీ టెస్ట్ : ధీటుగా బదులిచ్చిన లంకేయులు... 356/9
						
		
						
				
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది.
			
		          
	  
	
		
										
								
																	ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 180 పరుగులు వెనకబడి ఉంది. ఓవర్ నైట్ స్కోర్ 131/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంకను మథ్యూస్ (111), చండీమాల్ (147-నాటౌట్) ఆదుకున్నారు. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	మథ్యూస్ ఔటైన తర్వాత లాస్ట్ సెషన్‌లో శ్రీలంక వికెట్లు వెంటవెంటనే లాస్ట్ 15 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయింది. అయితే బ్యాడ్ లైట్ కారణంగా 5 ఓవర్లు ముందే మ్యాచ్‌ను ముగించడంతో శ్రీలంక ఆలౌట్ నుంచి తప్పించుకుంది. భారత్ బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా షమీ, ఇశాంత్, జడేజా తలా 2 వికెట్లు తీసుకున్నారు.  
	 
	అంతకుముందు, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 536/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, సొంతగడ్డపై ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ద్విశతకంతో చెలరేగిపోయాడు. ఏకంగా 234 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా ఇది కోహ్లీకి ఆరో డబుల్ సెంచరీ. దీంతో క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.