Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోవాకు ఆడనున్న అర్జున్ టెండూల్కర్

Advertiesment
Arjun Tendulkar
, శుక్రవారం, 12 ఆగస్టు 2022 (15:49 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఇకపై గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. 21 ఏళ్ల సచిన్ తనయుడు 2020-21 సీజన్‌లో ముస్తాక్ అలీ టోర్నీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. 
 
ఆ టోర్నీలో రెండంటే రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నప్పటికీ మైదానంలో దిగే అవకాశం లభించలేదు.
 
ఈ నేపథ్యంలో ముంబైకి గుడ్‌బై చెప్పేసి గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నట్టు అర్జున్ టెండూల్కర్ ప్రతినిధి తెలిపారు. అర్జున్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని, ముంబైతోనే ఉంటే అది సాధ్యం కాదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. 
 
మరోవైపు, అర్జున్ టెండూల్కర్ గోవాకు ప్రాతినిధ్యం వహించనున్న విషయాన్ని గోవా క్రికెట్ సంఘం నిర్ధారించింది.  అర్జున్‌తో ట్రయల్ మ్యాచ్‌లు ఆడిస్తామని, అందులో అతడి ప్రదర్శనను బట్టి సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారని గోవా క్రికెట్ సంఘం అధ్యక్షుడు సూరజ్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Dwayne Bravo అదుర్స్.. టీ20ల్లో 600 వికెట్లతో రికార్డ్