Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీమిండియాతో టీ20 సీరిస్... ఆరంభానికి ముందే విండీస్‌కు షాక్

Advertiesment
టీమిండియాతో టీ20 సీరిస్... ఆరంభానికి ముందే విండీస్‌కు షాక్
, శనివారం, 3 ఆగస్టు 2019 (17:26 IST)
టీమిండియాతో జరగనున్న టీ20 సీరిస్ ఆరంభానికి ముందే విండీస్‌కు పెద్ద ఎదురుదెబ్బతగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ టీ20 సీరిస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా ఫిట్నెస్ సాధించలేకపోవడంతో అతన్ని జట్టు నుండి తప్పించినట్లు విండీస్ బోర్డు ప్రకటించింది. 
 
రస్సెల్ స్థానంలో జేసన్ మహ్మద్‌ను భారత్‌తో జరిగే టీ20 సీరిస్ కోసం ఎంపిక చేశారు. ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ యూఎస్ఏలో జరుగనుంది. ఇప్పటికే క్రిస్ గేల్ వంటి విధ్వంసకర ఆటగాడు ఈ సీరిస్‌కు దూరమవగా తాజాగా రస్సెల్ కూడా గాయంతో వైదొలగడం విండీస్‌కు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. 
 
మూడు టీ20ల సీరిస్‌లో భాగంగా మొదటి రెండు వన్డేలు ప్లోరిడాలో జరగనున్నాయి. ఇక మూడో టీ20  గయానాలో జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు యూఎస్ఎకు చేరుకున్నాయి. భారత కాలమానం ప్రకారం మొదటి టీ20 ఇవాళ రాత్రి 8గంటలకు ప్రారంభంకానుంది.
 
ఈ టీ20 సీరిస్‌లో భారత్‌తో పాటు వెస్టిండిస్ జట్టు కూడా యువ ఆటగాళ్లను పరీక్షిస్తోంది. ఖారీ ఫెర్రీ, పూరన్, బ్రాంబెల్ వంటి యువకులను ఈ సీరిస్ కోసం ఎంపికచేసింది. 
 
ఇక భారత జట్టు కూడా రాహుల్ చాహర్, నవదీప్ సైనీ, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే వంటి యువ ఆటగాళ్లను ఈ సిరీస్‌లో బరిలోకి దించుతోంది. ఇలా యువ రక్తంతో ఉరకలెత్తుతున్న ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా పోరాడనున్నాయి. ఇందులో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో చూడాలి మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏదో ఒక రోజు కోచ్‌ అవుతా: గంగూలీ