Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏదో ఒక రోజు కోచ్‌ అవుతా: గంగూలీ

Advertiesment
ఏదో ఒక రోజు కోచ్‌ అవుతా: గంగూలీ
, శనివారం, 3 ఆగస్టు 2019 (13:21 IST)
టీమిండియా కోచ్‌ పదవిపై మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఏదో ఒక రోజు కోచ్‌ పదవి చేపడతానన్నాడు. కోచ్ పదవిపై తనకు చాలా ఆసక్తి ఉందని, ఐపీఎల్‌, క్యాబ్‌, టీవీ కామెంటరీ వంటి బాధ్యతలతో ప్రస్తుతం బిజీగా ఉన్నానని చెప్పిన దాదా.. భవిష్యత్తులో కచ్చితంగా ప్రయత్నిస్తానని తెలిపాడు. 
 
ఈసారి దరఖాస్తు చేసుకున్న వారిలో పెద్ద పేర్లు లేవని, మహేళ జయవర్ధనే రేసులో ఉన్నాడన్నారు. కానీ అతను అప్లై చేయలేదని తెలిసిందన్నాడు. రవిశాస్త్రి పదవి పొడిగింపు, కోచ్‌ ఎలా ఉండాలనే అంశంపై తాను మాట్లాడడం కరెక్టు కాదని దాదా అన్నాడు. ఏది ఏమైనా టీమిండియాకు కోచ్‌గా రావడం అనేది అదృష్టమన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు... కానీ జనవరి లోపు దిగుతా: సానియా