Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యంత సురక్షితమైనది ఫైజర్ వ్యాక్సిన్ : కరోనా వ్యాప్తికి బ్రేక్ పడినట్టేనా?

Advertiesment
Pfizer
, బుధవారం, 9 డిశెంబరు 2020 (08:46 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం అనేక ఫార్మా దిగ్గజాలు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైవున్నాయి. ఇలాంటి కంపెనీల్లొ ఒకటి ఫైజర్. ఈ కంపెనీ ఓ టీకాను తయారుచేసింది. ఫైజర్ బయో ఎన్‌ టెక్ తయారు చేసిన కోవిడ్ 19 వ్యాక్సిన్ అత్యంత సురక్షితమే కాకుండా ప్రభావంతమైనదని అమెరికాకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్‌డీఏ) వెల్లడించింది. ఈ మేరకు ఓ డాక్యుమెంట్‌ను రిలీజ్ చేసింది. 
 
యూఎస్ ఎఫ్డీఏ డాక్యుమెంట్‌తో అమెరికాలో తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్ ఏంటో దాదాపు తెలిసిపోయింది. దీంతో తొలుతగా ఫైజర్ వ్యాక్సిన్‌కే అనుమతి లభిస్తుందన్న ఊహాగానాలకు మద్దతు చేకూరింది. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌కు బ్రిటన్ అనుమతి ఇవ్వడంతో పాటు, పంపిణీ కూడా ప్రారంభించడంతో ఎఫ్డీయే నేతృత్వంలోని ఓ స్వతంత్ర కమిటీ గురువారం సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
 
ఇందులో భాగంగా, ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న దాదాపు 38 వేల మంది వలంటీర్ల ఆరోగ్యం, వారిలో పెరిగిన యాంటీ బాడీలు, వ్యాక్సిన్ సురక్షిత తదితరాలను పరిగణనలోకి తీసుకుని అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
వ్యాక్సిన్ 95 శాతం మేరకు పనిచేస్తోందని ఇప్పటివరకూ నిర్వహించిన ట్రయల్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అన్ని వయసుల వారిలోనూ ఈ వ్యాక్సిన్ ప్రభావశీలమైనదేనని, హై రిస్క్ ఉన్నవారిలోనూ యాంటీ బాడీలను పెంచిందని ట్రయల్స్ నివేదికలు ఇప్పటికే స్పష్టం చేశాయి.
 
అయితే, హై రిస్క్ వర్గంలోనూ ఈ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందన్న విషయాన్ని నిర్ధారించేందుకు మరిన్ని ఆధారాలు కావాలని ఎఫ్డీయేలోని కొందరు అధికారులు వ్యాఖ్యానించారు. రెండు డోస్‌లు తీసుకున్న తర్వాత కూడా ఎవరికైనా వైరస్ సోకిందా? అన్న విషయాన్ని కూడా తేల్చాల్సివుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
 
కాగా, ఇప్పటివరకూ ఫైజర్ వ్యాక్సిన్‌ను 43 వేల మంది తీసుకోగా, అందులో దాదాపు 5 వేల మంది గురించిన సమాచారం ఇంకా నియంత్రణా సంస్థలకు చేరలేదని తెలుస్తోంది. అయితే, ఇంజక్షన్ ఇచ్చిన శరీర భాగం వద్ద 84 శాతం రియాక్షన్, 63 శాతం మందిలో నీరసం, 55 శాతం మందికి తలనొప్పి, 38 శాతంలో కండరాల నొప్పులు, 23.6 శాతంలో కీళ్ల నొప్పులు, 14 శాతం మందికి జ్వరం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఇవన్నీ చాలా చిన్న సమస్యలేనని, ఒకటి లేదా రెండు రోజుల్లోనే తగ్గిపోతాయని ఫైజర్ శాస్త్రవేత్తలు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏలూరు పట్టణంలో వింత వ్యాధికి అసలు కారణమిదే...