Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రష్యా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ధర రూ. 995.40, దేశీయంగా తయారైతే ధర తగ్గవచ్చు

రష్యా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ధర రూ. 995.40, దేశీయంగా తయారైతే ధర తగ్గవచ్చు
, శుక్రవారం, 14 మే 2021 (14:12 IST)
న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో దేశంలో అందుబాటులోకి రానున్న రష్యా స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ ధర  995.40గా ఉండనుంది. రష్యానుంచి దిగుమతి చేసుకునే ఈ వ్యాక్సిన్ ధరను డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ శుక్రవారం వెల్లడించింది. దిగుమతి చేసుకున్న మోతాదుల ధరలో మోతాదుకు ఐదు శాతం జీఎస్టీ ఉంటుంది. భారతదేశంలో తయారైతే ఈ టీకా ధర  మోతాదు చౌకగా అందుబాటులోకి వస్తుందిన డా.రెడ్డీస్‌ తెలిపింది. 
 
వచ్చే వారం నుంచి స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ మార్కెట్లో లభించే అవకాశం ఉందని కేంద్రం గురువారం తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో సీరం ఉత్పత్తి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాలు లభిస్తున్నాయి. వాక్సిన్ కొరత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో రష్యా వాక్సిన్ రాకతో ఆ కొరత తీరే అవకాశం ఉందని భావిస్తున్నారు. 91.6 శాతం సామర్థ్యం కలిగిన స్పుత్నిక్-వీ  భారతదేశంలో ఉపయోగం కోసం ఆమోదించబడిన మూడవ టీకా అయిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ జగన్... స్టాలిన్‌ను చూసి నేర్చుకో : అచ్చెన్నాయుడు