కరోనావైరస్ చచ్చిపోయిందా? దేశం నుంచి పారిపోయిందా? లేదంటే భయపడి దాక్కుందా? వీళ్లను చూస్తే అదే అనిపిస్తుంది. కేంద్రం అన్ లాక్ 5.0తో సడలింపులు అలా ఇచ్చిందో లేదో హ్యాపీగా హోటళ్లలో లాగించేస్తున్నారు.
భయం భయంగా మాస్కులు వేసుకున్నప్పటికీ వాటిని తీసేసి చక్కగా అల్పాహారం, టీ, కాఫీలు తాగేస్తున్నారు. మరికొందరైతే అసలు మాస్కులే వేసుకోవడంలేదు. ఇది ముంబైలోని బాంద్రాలో సాయిప్రసాద్ హోటల్లోని దృశ్యం.
ఒకవైపు మహారాష్ట్రలో ఈరోజు కూడా 10 వేలకు పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 263 మంది ఈ ఒక్కరోజులోనే మృత్యువాతపడ్డారు.
ఇంకోవైపు దేశంలో కేసుల సంఖ్య 66 లక్షలకు చేరుకుంది. వీరిలో లక్షా 3 వేల మంది మరణించారు. కాగా 5 లక్షలా 59 వేల మంది కోలుకున్నారు. మిగిలినవారు ఇంకా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాలు ఎంత అన్ లాక్ ఇచ్చినప్పటికీ జాగ్రత్తలు పాటించకపోతే కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగిపోయే ప్రమాదం వుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.