ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 108 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 21010 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరికి 108 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది.
ఈ కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 36 కేసులు నమోదు కాగా, విశాఖపట్టణం జిల్లాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 17 కేసుల చొప్పున నమోదయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్తకేసులేవీ నమోదు కాలేదు.
ఇదిలావుంట్, ఈ వైరస్ బారి నుంచి 141 మంది కోలుకున్నారు. అలాగే, రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,976 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,58,631 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. కృష్ణా జిల్లాలో నమోదైన ఒక మృతి కేసుతో కలుపుకుంటే మొత్తం మృతుల సంఖ్య 14,467 మంది చనిపోయారు.
ప్రపంచంలో తొలి ఒమిక్రాన్ మరణం
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ సోకిన రోగి ఒకరు మరణించారు. ఇది తొలి కరోనా మరణం. ఈ మరణం కూడా బ్రిటన్‍లో నమోదైంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ధృవీకరించారు.
సోమవారం ఆయన వెస్ట్ లండన్‌లోని పడింగ్టన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఓ వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒమిక్రాన్ వైరస్ బారినపడి రోగి ఒకరు మృతి చెందడం చాలా బాధాకారమన్నారు.
"ఒమిక్రాన్ వేరియంట్ మధ్యరకం వెర్షన్ అని నేను అనుకుంటున్నాను. ఈ వేరియంట్ మరింత విస్తరించకుండా అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. జనాల్లో ఇది ఎంత వేగంగా వ్యాపిస్తుందో గుర్తించాల్సివుంది. అదేవిధంగా ఈ వేరియంట్ కట్టడికి అందరికీ బూస్టర్ డోస్‌లు అందించడమే ఉత్తమం అనేది తన అభిప్రాయం' అని చెప్పుకొచ్చారు.