Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులెన్ని? - పొంచివున్న థర్డ్ వేవ్ ముప్పు!

ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులెన్ని? - పొంచివున్న థర్డ్ వేవ్ ముప్పు!
, బుధవారం, 6 అక్టోబరు 2021 (11:12 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన వివరాల మేరకు.. దేశంలో కొత్తగా మరో 18,833 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య‌ 3,38,71,881కు చేరింది. 
 
ప్ర‌స్తుతం ఆస్పత్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,46,687 మంది చికిత్స తీసుకుంటున్నారు. యాక్టివ్ కేసులు 203 రోజుల క‌నిష్టానికి చేరాయి. ఇక క‌రోనా నుంచి కొత్త‌గా 24,770 మంది కోలుకున్నారు. మంగళవారం క‌రోనాతో 278 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య‌ 4,49,538కి చేరింది. 
 
మరోవైపు, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) గట్టి హెచ్చరిక చేసింది. భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరించింది.
 
ముఖ్యంగా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, ఝార్ఖండ్, గోవా, హర్యానా, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరో రెండు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.
 
మరోవైపు వైద్య నిపుణులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. టీకాలు వేయించుకోని వ్యక్తులు, పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని చెపుతున్నారు. ఈ సందర్భంగా, ఎయిమ్స్ భోపాల్ డైరెక్టర్ డాక్టర్ శర్మన్ సింగ్ మాట్లాడుతూ, థర్డ్ వేవ్ రావడం, రాకపోవడం ప్రజలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ పాలన సరిగా లేదనీ.. గుండు గీయించుకున్న బీజేపీ ఎమ్మెల్యే..