Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో కోటి దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

Advertiesment
India
దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన లెక్కల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా మరో 12,899 మందికి ఈ వైరస్ సోకింది. ఈ కేసులతో కలుపుకుని మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,90,183కు చేరింది.
 
అలాగే, 17,824 మంది కోలుకున్నారు. ఇకపోతే, గడచిన 24 గంట‌ల సమయంలో 107 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,703 కు పెరిగింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,04,80,455 మంది కోలుకున్నారు. 1,55,025 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 44,49,552 మందికి వ్యాక్సిన్ వేశారు.
 
కాగా, దేశంలో బుధవారం వరకు మొత్తం 19,92,16,019 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,42,841 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంచాయతీ పోల్ : ఓటుకు రూ.5 వేలు అయినా ఫర్లేదు...