Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అబ్బెబ్బే... భారత్‌తో యుద్ధం వద్దు.. శాంతిని కోరుకుంటున్నాం.. పాకిస్థాన్

అబ్బెబ్బే... భారత్‌తో యుద్ధం వద్దు.. శాంతిని కోరుకుంటున్నాం.. పాకిస్థాన్
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (06:57 IST)
శత్రుదేశం పాకిస్థాన్ శాంతిమంత్రం జపించింది. ఓవైపు పక్కలో బల్లెంలా తయారై ఉగ్రమూకలను రెచ్చగొడుతూనే మరోవైపు శాంతిమంత్రి పఠిస్తోంది. రావల్పిండిలో జరిగిన వైమానిక దళానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా మాట్లాడుతూ, తమది శాంతిని కోరుకునే దేశమన్నారు.
 
ముఖ్యంగా, భారతదేశంలో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ఇరు దేశాలు శాంతియుతంగా కలిసి సాగాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. అన్ని దేశాలకు స్నేహ హస్తాన్ని చాచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని, తన ప్రకటనలకు పెడార్థాలు తీయవద్దని విజ్ఞప్తి చేశారు. 
 
పాకిస్థాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, దేశ అభివృద్ధిని కోరుకుంటోందని చెప్పారు. కాశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కయ్యాలకు కాలు దువ్వడం కంటే, పరస్పర గౌరవానికే పాకిస్థాన్ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జిల్లాలో 30 మంది ఎంపీడీవోల బదిలీకి నిమ్మగడ్డ ఆదేశం