Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో కొత్తగా 15 వేల పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా 15 వేల పాజిటివ్ కేసులు
, శనివారం, 16 అక్టోబరు 2021 (11:31 IST)
దేశంలో కొత్తగా మరో 15,981 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గడిచిన 24 గంటల్లో 17,861 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 3,33,99,961కు చేరింది. నిన్న క‌రోనాతో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,51,980 కి చేరుకుంది.
 
అలాగే, దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 3,40,53,573గా నమోదైంది. ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,01,632 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక దేశంలో నిన్న 8,36,118 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు వేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 97,23,77,045కి చేరింది.
 
మరోవైపు, శుక్రవారం వెల్లడించిన మీడియా బులిటెన్ మేరకు గత 24 గంటల్లో కేవలం 104 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో 218 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ఒక వ్యక్తి కరోనా కారణంగా మృతి చెందారు. 
 
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 6,68,722 కేసులు నమోదయ్యాయి. వీరిలో 6,60,730 మంది కోలుకున్నారు. మొత్తం 3,936 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,056 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 48 కేసులు నమోదయ్యాయి. 
 
అదేవిధంగా ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం లెక్కల ప్రకారం 540 కేసులు నమోదు కాగా... ఈరోజు ఆ సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 44,946 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... 586 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 119 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 5 కేసులు నమోదయ్యాయి.
 
ఇదేసమయంలో 9 మంది మృతి చెందగా... 712 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,59,708కి పెరిగింది. మొత్తం 20,38,960 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 14,295 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,453 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొవిడ్ మాటున‌ పెరుగుతోన్న టీబీ మరణాలు