Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో తొలి నోకియా 5జీ ఫోన్‌... అక్టోబర్ 20న విడుదల

Advertiesment
భారత్‌లో తొలి నోకియా 5జీ ఫోన్‌... అక్టోబర్ 20న విడుదల
, గురువారం, 14 అక్టోబరు 2021 (18:44 IST)
Nokia XR20,
భారత్‌లో తొలి నోకియా 5జీ ఫోన్‌ను హెచ్ఎండీ గ్లోబల్ ఈనెలలో లాంఛ్ చేయనుంది. అక్టోబర్ 20న నోకియా ఎక్స్ఆర్‌20 ప్రీబుకింగ్స్ తమ వెబ్‌సైట్‌లో ఓపెన్ అవుతాయని నోకియా ఇండియా ప్రకటించింది. ప్రీలాంఛ్ ఆఫర్ కింద ఫోన్‌తో పాటు నోకియా పవర్ ఇయర్‌బడ్స్ లైట్‌, ఏడాది పాటు స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ వెల్లడించింది.
 
ఇక భారత్‌లో సీ30 స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంఛ్ చేస్తామని నోకియా ఇండియా ప్రకటించింది. నోకియా ఎక్స్ఆర్20 డ్రాప్ రెసిస్టెంట్‌..స్క్రాచ్ రెసిస్టెంట్‌..టెంపరేచర్ రెసిస్టెంట్‌..వాటర్ రెసిస్టెంట్ ఫోన్‌గా ఉంటుందని కంపెనీ తెలిపింది. 
 
ఎక్స్ఆర్‌20 భారత్‌లో 6జీబీ ర్యామ్‌, 128జీబీ ఆర్ఓఎం వెర్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ఫుల్ హెచ్‌డీప్లస్ స్క్రీన్‌, బ్యాక్ ప్యానెట్‌లో టూ కెమెరా సెటప్‌తో 6.67 ఇంచ్‌ల ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
 
4630ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఫుల్ చార్జితో ఫోన్ రెండు రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 5జీ చిప్‌సెట్‌తో అందుబాటులోకి రానున్న నోకియా ఎక్స్ఆర్‌20 ధర రూ 38,000 నుంచి రూ 42,000 మధ్య అందుబాటులో ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్యలో కాల్పులు కలకలం: వ్యక్తి మృతి.. ఇద్దరు బాలికలకు గాయం