Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ మూడో దశకు వెళితే ప్రమాదకరం, డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, డైరెక్టర్, ఢిల్లీ ఎయిమ్స్‌

కరోనా వైరస్ మూడో దశకు వెళితే ప్రమాదకరం, డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, డైరెక్టర్, ఢిల్లీ ఎయిమ్స్‌
, సోమవారం, 6 ఏప్రియల్ 2020 (21:42 IST)
దేశంలో పలు ప్రాంతాల్లో “కరోనా వైరస్‌“ రెండో దశను దాటి మూడో దశకు చేరుకుందని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ప్రకటించారు. మూడో దశ దేశ వ్యాప్తంగా కేవలం కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే ఉందని వెల్లడించిన ఆయన దేశంలో “కరోనా వైరస్”‌ వ్యాప్తి రోజురోజుకూ పెరగడం ఆందోళనకరంగా ఉందని అన్నారు.
 
దేశ వ్యాప్తంగా అత్యధిక భాగం కేవలం రెండోదశకు పరిమితం కావడం కొంత ఉపశమనం కలిగించే అంశం అన్నారు. మూడోదశ అనేది మన దేశంలో ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని దానిని అదుపు చేయడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.
 
ఎంత త్వరగా అరికడితే అంతమంచింది. లేకపోతే మూడోదశ ఉధృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని, దేశంలో “కరోనా వైరస్‌” వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని అన్నారు.
 
“వైరస్”‌ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా “పాజిటివ్‌” కేసుల సంఖ్యతో పాటు “వైరస్”‌ సోకి మృతి చెందిన వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని, ఇక ఢిల్లీలోని “మర్కజ్”‌ మత ప్రార్థనాల కారణంగానే దేశంలో “కరోనా” కేసులు విపరీతంగా పెరిగాయన్నారు.
 
ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించడం కష్టతరమైనప్పటికీ.. ప్రభుత్వాలు చర్యలు సఫలమయ్యాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో “లాక్‌డౌన్”‌ ఎత్తివేయడం గురించి చెప్పలేమని, ఏప్రిల్‌ 10 తరువాత పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పిస్తాం అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్మల్ జిల్లాలో మరో ముగ్గురికి కరోనా వైరస్ నిర్ధారణ