నిర్మల్ జిల్లాలో మరో ముగ్గురికి కరోనా వైరస్ నిర్ధారణ

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (21:30 IST)
నిర్మల్ జిల్లాలో మరో ముగ్గురికి కరోనా వ్యాధి నిర్ధారణ అయినట్లు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. కోవిడ్19 వ్యాధి నిర్ధారణ నిమిత్తం 97 మంది రక్త నమూనాలు (శాంపుల్) హైదరాబాద్‌కు పంపగా అందులో నుండి 35 శాంపుళ్లకు ఆదివారం ఫలితాలు రాగా అందులో ఒక్కరికి మాత్రమే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మిగతా 34 శాంపిల్స్ నెగటివ్ రావడం జరిగిందని అన్నారు.
 
సోమవారం రోజున ముగ్గురికి (నిర్మల్ పట్టణంలో ఒకరికి, భైంసా పట్టణంలో ఒకరికి, నర్సాపూర్ జి మండలం చాక్ పల్లి  గ్రామానికి చెందిన ఒకరికి) కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా 30 మందికి నెగటివ్ రిజల్ట్స్ వచ్చాయని, ఈరోజు సోమవారం  అదనంగా 43 శాంపిల్స్‌ను హైదరాబాదు పంపడం జరిగిందన్నారు. 
 
జిల్లాలో మొత్తం 140 మంది శాంపిల్స్ హైదరాబాదుకు పంపగా అందులో నుండి ఇప్పటి వరకు 64 శాంపుల్ నెగటివ్ రాగా, నాలుగు పాజిటివ్, ఇంకా 72 శాంపుల్ ఫలితాలు రావాల్సి ఉందన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం