Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెడ నొప్పి, కీళ్ళ నొప్పులున్నాయా? డెల్టా ఏమో... త‌స్మాత్ జాగ్ర‌త్త‌!!

మెడ నొప్పి, కీళ్ళ నొప్పులున్నాయా? డెల్టా ఏమో... త‌స్మాత్ జాగ్ర‌త్త‌!!
, మంగళవారం, 20 జులై 2021 (11:24 IST)
ఇప్పటి వరకు కోవిడ్-19 వైరస్ రెండు వేవ్ లను చూసాం. ఇప్పుడు రాబోయేది అత్యంత ప్రమాదకరమైన మూడో వేవ్ డెల్టా వేరియంట్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రమాదకారి అయిన డెల్టా వేరియంట్ లక్షణాలు కోవిడ్-19 మొదటి, రెండవ దశ కన్నా చాలా భిన్నంగా ఉంటాయి. ఇది వరకులా దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఏవీ లేకుండా ఎక్కువగా కీళ్ల నొప్పులు, మెడ, మెడ వెనుక కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం, న్యుమోనియా లక్షణాలను కలిగి ఉండి, ఇది వరకటి వైరస్ కంటే ఎక్కువగా ప్రాణనష్టం సంభవించటానికి అవకాశాలున్నాయి. 
 
ఈ డెల్టా వేరియంట్ వైరస్ ప్రభావం వలన మనిషి తీవ్రమైన అనారోగ్యానికి గురికావడానికి అతి తక్కువ సమయం తీసుకుంటుంది. కొన్ని సందర్భాలలో ఎటువంటి లక్షణాలు బయటపడకుండా సంక్రమిస్తుంది. ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది.

కాబ‌ట్టి మనమందరం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  ఈ దశలో వైరస్ ముక్కు, గొంతు ప్రాంతాలపై దాని ప్రభావాన్ని చూపకుండా నేరుగా ఊపిరితిత్తులలోకి ప్రవేశించి వాటిని పూర్తిగా దెబ్బ తీస్తుంది. ఈ వైరస్ సంక్రమించడానికి, నిర్ధారణ జరగడానికి మధ్య చాలా స్వల్ప కాలిక వ్యవధి మాత్రమే ఉంటుంది. ఈ మూడవ దశ వేరియంట్ సోకిన చాలా మందికి ఎటువంటి జ్వరం మరియు నొప్పులు బహిర్గతం కాకుండా, ఛాతి ఎక్సరే రిపోర్టు లొనే న్యుమోనియా లక్షణాలు కనపడుతున్నాయ‌ని వైద్య నిపుణులు చెపుతున్నారు. 
 
ఈ మూడవ దశ లో ముక్కు ద్వారా నిర్వహించే కోవిడ్ నిర్ధారణ పరీక్ష లో చాలా వరకూ అందరికి నెగెటివ్ ఫలితాన్నే చూపిస్తుంది. దానికి ప్రధాన కారణం, ఈ మూడవ దశ డెల్టా వేరియంట్ వైరస్ అనేది ఇదివరకులా ముక్కు, గొంతు ప్రాంతాలలో చేరి ఉండ‌దు. మనం అర్ధం చేసుకోవలసిన విషయమేమిటంటే, ఈ వైరస్ అతి త్వరగా, నేరుగా ఊపిరితిత్తుల పైన దాడి చేసి తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు క‌లిగించి, మనిషికి ప్రాణహాని క‌లిగిస్తుంది. 
 
అందుకే... రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకండి... ప్ర‌తి ఒక్కరితో 1.5 మీటర్లు భౌతిక దూరాన్ని పాటిస్తూ, రెండు మాస్కులను సక్రమంగా ధ‌రిస్తూ, చేతులను తరచుగా హేండ్ సానిటైజర్, సబ్బుతో శుభ్రపరచుకుంటూ ఉండ‌టం మంచిది. బహిర్గత లక్షణాలు చూపని వైరస్ స్ట్రైన్ కాబ‌ట్టి ఎవరితో ఆలింగనం, కరచాలనం చేయకుండా అతి జాగ్రత్తగా నడుచుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు..