Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ ఫోర్త్ వేవ్ వచ్చేస్తోంది, ఎప్పటి నుంచి ఎప్పటి దాకా?

Advertiesment
COVID-19 4th wave
, ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (20:01 IST)
దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఊపిరి పీల్చుకునే లోపే త్వరలో కోవిడ్ ఫోర్త్ వేవ్ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త షాకిస్తోంది. ఐఐటీ కాన్పూర్ పరిశోధకుల ప్రకారం, మన దేశంలో ఫోర్త్ వేవ్ జూన్ 22 నుండి ప్రారంభమై అక్టోబర్ 24 వరకు కొనసాగవచ్చు. అయినప్పటికీ, ఫోర్త్ వేవ్ తీవ్రత కొత్త వేరియంట్‌ల ఆవిర్భావం, వ్యక్తుల టీకా స్థితిపై ఆధారపడి ఉంటుందని వారు తెలిపారు.

 
కోవిడ్-19 ఫోర్త్ వేవ్ కనీసం నాలుగు నెలల పాటు కొనసాగుతుందని, అది ఆగస్ట్ 15 నుండి 31 వరకు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చనీ, ఆ తర్వాత తగ్గుతుందని చెపుతున్నారు. చాలా దేశాలు ఇప్పటికే థర్డ్ వేవ్ చూశాయి. కొన్ని దేశాలు మహమ్మారి ఫోర్త్ వేవ్ తీవ్రతను ఎదుర్కొంటున్నాయి.

 
కోవిడ్ ఫోర్త్ వేవ్ వైరస్ లక్షణాలు ఎలా వుండొచ్చు?
2 సంవత్సరాల క్రితం ఉద్భవించిన కోవిడ్-19 సాధారణ లక్షణాలు మనందరికీ తెలుసు. కానీ, వైరస్ మరింత మందికి వ్యాపించడంతో పరివర్తన చెందడంతో వ్యక్తులలో కొత్త లక్షణాలు కనిపిస్తుండటాన్ని తాము కనుగొన్నట్లు తెలిపారు. ఇప్పుడు, బిఎ 2 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ యొక్క ఉప-వేరియంట్, దీర్ఘకాలంగా కోవిడ్ సోకిన వ్యక్తులలో సర్వసాధారణంగా మారినందున, ప్రజలు ఇప్పుడు అనుభవించే కొన్ని సాధ్యమైన కరోనావైరస్ లక్షణాల గురించి శాస్త్రవేత్తలు వెల్లడించారు.

 
సాధారణ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు తగ్గుముఖం పట్టడంతో ఇటీవలి వారాల్లో బిఎ-2 వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ఇతర కరోనావైరస్ వేరియంట్‌లతో పోలిస్తే బిఎ 2 వేరియంట్ లక్షణాలు భిన్నంగా ఉన్నాయని తెలుస్తోంది. బిఎ 2 వేరియంట్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన కోవిడ్ లక్షణాలు ఏంటంటే... మైకంగా వున్నట్లనిపించడంతో పాటు అలసట వుంటుందని వెల్లడించారు.

 
దీర్ఘకాల కోవిడ్ సోకిన వ్యక్తులు వారి ప్రారంభ వైరస్ సంక్రమణ తర్వాత కొన్ని వారాల నుండి నెలల వరకు కొన్ని లక్షణాలను కలిగి ఉంటారని చెప్పారు. దగ్గు, వాసన లేదా రుచి కోల్పోవడం, తలనొప్పి, వికారం, తల తిరగడం, కండరాల నొప్పులు వంటి లక్షణాలు వారాలు లేదా నెలలు ఉండవచ్చు. రోగ లక్షణాల తీవ్రత ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది, కాబట్టి ఏవైనా లక్షణాలు కొనసాగుతున్నా లేదా అవి ప్రారంభమైన కొన్ని రోజుల కంటే ఎక్కువ ఉంటే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం అని చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంగిస ఎంత పనిచేసిందంటే... బెంగాలీ నటిపై కేసు నమోదు