Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

219 మంది భారతీయులతో ముంబైకి ఎయిర్ఇండియా విమానం

Advertiesment
219 మంది భారతీయులతో ముంబైకి ఎయిర్ఇండియా విమానం
, శనివారం, 26 ఫిబ్రవరి 2022 (16:40 IST)
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 219 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా విమానం రోమేనియన్ రాజధాని బుకారెస్ట్ నుంచి ముంబైకి శనివారం బయలుదేరింది. 
 
ఈ విమానం రాత్రి 9 గంటలకు ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 470 మందికి పైగా భారతీయ పౌరులు భూ మార్గం ద్వారా శుక్రవారం బుకారెస్ట్ చేరుకున్నారు.
 
సుమారు 20,000 మంది భారతీయులు, ప్రధానంగా విద్యార్థులు ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. ఉక్రేనియన్ గగనతలం మూసివేయడానికి ముందు, ఎయిర్ ఇండియా ఫిబ్రవరి 22న ఉక్రేనియన్ రాజధాని కైవ్‌కు ఒక విమానాన్ని నిర్వహించింది.
 
ఈ విమానం 240 మందిని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చింది. అలాగే ఫిబ్రవరి 24, 26న మరో రెండు విమానాలను నడపాలని భారత్ యోచించింది, కానీ ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో రష్యన్ దాడి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్రెయిన్ నుంచి భారత్‌ పౌరుల తరలింపు - రొమేనియా నుంచి బయలుదేరిన విమానం