Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్ కొత్త లక్షణం, నోట్లో దద్దుర్లు లేదా పుండ్లు

కరోనావైరస్ కొత్త లక్షణం, నోట్లో దద్దుర్లు లేదా పుండ్లు
, మంగళవారం, 18 ఆగస్టు 2020 (18:51 IST)
కరోనావైరస్ లక్షణాల జాబితా పెరుగుతోంది. ఇప్పుడు ప్రతిదీ అనుమానించవలసి వస్తోంది. సాధారణ ఫ్లూ లక్షణాలతో పాటు, కొత్త లక్షణాలు చేర్చబడినటువంటి వాసన, రుచి కోల్పోవడంతో పాటు కొత్తగా నోటిలో పుండ్లు కూడా వచ్చి చేరాయి. కరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త లక్షణాలు బెంబేలెత్తిస్తున్నాయి.
 
స్పెయిన్లోని వైద్యులు చేసిన కొత్త అధ్యయనం ప్రకారం, వైద్యపరంగా ఎనాన్థెమ్ అని పిలువబడే నోటి లోపలి భాగంలో దద్దుర్లు లేదా పుండ్లు అదనపు COVID-19 లక్షణం కావచ్చు. వారి అధ్యయనంలో ఇలాంటి లక్షణాలు కలిగిన 21 మంది రోగులను పరిశీలించినప్పుడు వారికి కోవిడ్ నిర్ధారణైంది. నోటిలో పుండ్లతో పాటు చర్మంపై దద్దుర్లు కూడా వచ్చాయి. ఈ దద్దుర్లు ఇతర COVID లక్షణాలు మొదలయ్యే రెండు రోజుల ముందు నుండి 24 రోజుల తరువాత ఎప్పుడైనా కనిపిస్తాయని అధ్యయనం పేర్కొంది. సగటు సమయం 12 రోజులు.
 
ఈ దద్దుర్లు శ్లేష్మ పొరపై ఎర్రటి లేదా తెలుపు రంగులో ఉండే చిన్న మచ్చలు. చికెన్ పాక్స్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న రోగులలో ఇది చాలా సాధారణం. చేతి, పాదం మరియు నోటి వ్యాధిగా కనబడుతుంది. శ్లేష్మ పొరలను ప్రభావితం చేయడం చాలా వైరల్ దద్దుర్లు యొక్క లక్షణం.
 
ఐతే కోవిడ్‌తో ఈ లక్షణం విస్తృతంగా వ్యాపించిందనే వాస్తవం ఇంకా తెలియదు. ఎందుకంటే భద్రతా సమస్యల కారణంగా, చాలా మంది రోగులకు వారి నోటి లోపలి భాగం పరిశీలించబడలేదు. గతంలో, కరోనా సాధారణ లక్షణాలు జ్వరం, అలసట, పొడి దగ్గు అని WHO తెలిపింది. కొంతమంది రోగులకు నొప్పులు, ముక్కు కారటం, గొంతు నొప్పి లేదా విరేచనాలు ఉండవచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా తేలికపాటివి, రోగుల్లో క్రమంగా ప్రారంభమవుతాయి. ఐతే కొంతమంది వ్యాధి బారిన పడినప్పటికీ ఎటువంటి లక్షణాలు కనబడవు. అనారోగ్యంగా అనిపించరు.
 
అందువల్ల ఈ కరోనా సమయంలో భౌతిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం చేయాలి. దగ్గు, జలుబు, గొంతునొప్పి లక్షణాలు వున్నవారు వెంటనే వైద్యుని సంప్రదించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 3 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు - మొత్తం మరణాల సంఖ్య ఎంతంటే?