కరోనా అంటే మొదట్లో ఎంతో భయపడేవారు. లాక్ డౌన్ కూడా పెట్టారు. అయితే ఆ తరువాత లాక్ డౌన్ ఎత్తేయడం.. జనం షరా మామూలుగా తిరిగేస్తున్నారు. అయితే ప్రస్తుతం రెండవ దశ కరోనా జనాన్ని భయానికి గురిచేస్తోంది. అయితే ఈ కరోనా ప్రాణాంతకం కాదు కానీ ప్రమాదకరమే అంటున్నారు వైద్యులు. చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
పాత స్ట్రెయిన్ లక్షణాలు అయితే జ్వరం, పొడి దగ్గు, వాసన, రుచి కోల్పోవడం జరుగుతుంది. అదే ప్రస్తుతం కొత్త స్ట్రెయిన్ లక్షణాలు నొప్పులు బాధలు, గొంతు నొప్పి, కళ్ళు ఎర్రబడటం, చర్మంపై దురదలు, తలనొప్పి, డయేరియా, వేళ్ళు లేదా కాలి బొటనవేలి మీద మంటలు వస్తాయట.
ఇందులో ఏ లక్షణాలు ఉన్నా వెంటనే వైద్యులను కలవాలట. ఆలస్యం చేసే కొద్దీ ప్రాణానికి ప్రమాదమంటున్నారు. సెకండ్ వేవ్ కరోనా వస్తే ఖచ్చితంగా 15 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనంటున్నారు వైద్యులు. ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఉండాలట.