Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గూగుల్ సెర్చ్‌లో ఇలాంటివి వెతికితే మీ ఖాతాలో డబ్బు ఫటాఫట్... దెబ్బకు ఖాళీ

Advertiesment
గూగుల్ సెర్చ్‌లో ఇలాంటివి వెతికితే మీ ఖాతాలో డబ్బు ఫటాఫట్... దెబ్బకు ఖాళీ
, శనివారం, 27 ఫిబ్రవరి 2021 (13:13 IST)
ఇప్పుడు ప్రతిదానికీ గూగుల్ సెర్చ్ చేయడం అలవాటైంది. క్రెడిట్ కార్డు పేమెంట్స్ దగ్గర్నుంచి సౌందర్య సాధనాలు, వస్తు కొనుగోళ్లు ఇలా ప్రతి ఒక్కదానికి గూగుల్ సెర్చ్ ప్రధాన వనరుగా మారింది. ఐతే ఈ వనరునే హ్యాకర్ల ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. చిన్నచిన్న మార్పులు చేసి చక్కగా డబ్బు కొట్టేస్తున్నారు. అందుకే ప్రతినిత్యం మనం సెర్చ్ చేసే కొన్ని యాప్స్, లింకుల పట్ల చాలా జాగ్రత్తగా వుండాలి. వాటి జాబితా ఏమిటో చూద్దాం.
 
క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నెంబర్లు వెతికేవారు కొన్నిసార్లు ఫేక్ నెంబరుకి కనెక్ట్ అయ్యే అవకాశం వుంది. కనుక అధికారిక బ్యాంకు పేజీలో మాత్రమే దీన్ని చూసుకోవాలి. ఫోన్, పిసిల్లో కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేస్తుంటారు. ఇలాంటి అప్లికేషన్లతో డేంజర్. అవసరం అనుకుంటేనే వాటిని డౌన్లోడ్ చేయాలి. అది కూడా అధికారిక సైట్ల నుంచి మాత్రమే చేసుకోవాలి. గూగుల్ సెర్చ్ చేసి టాప్ స్థానంలో వచ్చింది కదా అని డౌన్లోడ్ అయితే మీ ఖాతా హ్యాక్ అవడం చాలా ఈజీ.
 
ఆన్ లైన్ బ్యాంకింగ్ మరో అవకాశం. ఎక్కువగా బ్యాంకు బిల్లుల చెల్లింపు డబ్బు బదిలీకి ఈ లింకులను క్లిక్ చేసి లాగిన్ అవుతుంటాం. కేటుగాళ్లు ఒక్క అక్షరం తేడాతో అంతా బ్యాంక్ వెబ్ సైట్లా భ్రమింపజేస్తారు. అందులో కనుక లాగిన్ అయితే ఇక మీ ఖాతా వాడి జేబులో వున్నట్లే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.
 
ప్రభుత్వరంగ సేవలైన కరెంటు బిల్లులు, మున్సిపల్ ట్యాక్సులు ఇతర బిల్లుల చెల్లింపుల కోసం కూడా గూగుల్ సెర్చ్ చేస్తుంటారు. ఇలాంటివి కూడా మానుకోవడం మంచిది. అలాగే పలు ఔషధాల కోసం, వాటి పనితీరు కోసం గూగుల్ సెర్చ్ చేసి వివరాలు చూస్తుంటారు. అవి కూడా మానేయడం మంచిది. నేరుగా మీ ఫ్యామిలీ వైద్యుడిని సంప్రదిస్తే వివరాలు తెలుసుకోవచ్చు. కనుక గూగుల్ సెర్చ్ ఆర్థికపరమైన వాటికి ఉపయోగించకుండా వుండటం మంచిది. కేవలం సమాచారం కోసం మాత్రమే దానిని ఉపయోగించడం చేయాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్న కూతురిని గర్భవతిని చేసిన కసాయి తండ్రి.. కడుపు ఉబ్బెత్తుగా..?