Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ - covid 19 కేవలం 14 గంటల్లో చనిపోతుందా? WHO ఏం చెప్తోంది?

కరోనా వైరస్ - covid 19 కేవలం 14 గంటల్లో చనిపోతుందా? WHO ఏం చెప్తోంది?
, ఆదివారం, 22 మార్చి 2020 (14:00 IST)
వైద్యులు, నర్సులు, ప్రజారోగ్య నిపుణులు మరియు ఇతర ఫ్రంట్‌లైన్ కార్మికులు భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందడాన్ని అడ్డుకునేందుకు కష్టపడుతుండగా, వారి ప్రయత్నాలను క్లిష్టతరం చేయడం, నకిలీ వార్తలు సృష్టించడం, వాట్సాప్‌లో ధృవీకరించబడని ఫార్వర్డ్‌లు చేస్తున్నారు చాలామంది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రకటించిన 14 గంటల ‘జనతా కర్ఫ్యూ’ ఒక రోజులో వైరస్ వ్యాప్తిని ఆపుతుందని ఓ తప్పుడు సమాచారం రౌండ్లు కొడుతోంది. కరోనా వైరస్ యొక్క జీవితం ఒకే చోట “కేవలం 12 గంటలు” మాత్రమేనని, అందువల్ల, మార్చి 22, ఆదివారం 14 గంటల కర్ఫ్యూతో, భారతదేశం ‘వైరస్ రహితంగా’ మారుతుందని ఆ నకిలీ వార్తల సారాంశం.
 
ఐతే ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప్రకారం, COVID-19కి కారణమయ్యే వైరస్ ఉపరితలాలపై ఎంతకాలం మనుగడ సాగిస్తుందో ఖచ్చితంగా తెలియదని వెల్లడించింది, కానీ ఇది ఇతర కరోనా వైరస్‌లా ప్రవర్తిస్తుంది. "కరోనా వైరస్‌లు (COVID-19 వైరస్ పైన ప్రాథమిక సమాచారంతో సహా) కొన్ని గంటలు లేదా చాలా రోజుల వరకు ఉపరితలాలపై కొనసాగే అవకాశం వుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఐతే ఇది వేర్వేరు పరిస్థితులలో మారే అవకాశం వుంది (ఉదాహరణకు ఉపరితల రకం, ఉష్ణోగ్రత లేదా పర్యావరణం యొక్క తేమ పైన ఆధారపడి దాని జీవితకాలం వుంటుంది). ” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
 
వైరస్ వివిధ ఉపరితలాలపై ఎంతకాలం ఉంటుందనే అంశంపై మొదటి అధ్యయనాలలో యుఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) లోని వైరాలజిస్ట్ వాన్ డోరెమలెన్ నాయకత్వం వహించారు. మార్చి 17న న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో వైరస్ మూడు గంటల వరకు గాలిలో ఉండగలదని తేలింది. ఆ అధ్యయనం ప్రకారం, వైరస్ ఇతర ఉపరితలాలపై ఎక్కువసేపు ఉంటుంది. కార్డో బోర్డ్ ఉపరితలాలపై 24 గంటల వరకు, ప్లాస్టిక్ మరియు లోహ ఉపరితలాలపై రెండు నుండి మూడు రోజుల వరకు వుండే అవకాశం వుంది.
webdunia
ది జర్నల్ ఆఫ్ హాస్పిటల్ ఇన్ఫెక్షన్లో మరొక అధ్యయనం ప్రకారం, కరోనా వైరస్‌లు లోహ, గాజు లేదా ప్లాస్టిక్ వంటి నిర్జీవ ఉపరితలాలపై తొమ్మిది రోజుల వరకు ఉండవచ్చని సూచిస్తున్నాయి. మిమ్మల్ని మరియు ఇతరులను రక్షించుకోవడానికి వైరస్‌ను చంపడానికి సాధారణ క్రిమిసంహారక బారిన పడినట్లే భావిస్తూ ఉపరితలాన్ని శుభ్రపరచాలని WHO సిఫార్సు చేస్తుంది. “మీ చేతులను ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్‌తో శుభ్రం చేయండి లేదా సబ్బు మరియు నీటితో కడగాలి. మీ కళ్ళు, నోరు లేదా ముక్కును తాకడం చేయకూడదు. ” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేస్తుంది.
 
కాగా నటుడు, రాజకీయ నాయకుడు రజనీకాంత్ తన ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో జనతా కర్ఫ్యూకి మద్దతు తెలుపుతూ నకిలీ సందేశాన్ని పునరావృతం చేసినట్లు కనిపించారు. "ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా వున్నట్లయితే, కరోనా వైరస్, 12 నుండి 14 గంటలు వ్యాపించకపోతే మూడవ దశకు వెళ్ళకుండా నిరోధించవచ్చు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ కోసం పిలుపునిచ్చారు" అని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అయింది. ఐతే ట్విట్టర్ ఈ వీడియోను తొలగించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్.. ఆరుకి చేరిన మృతుల సంఖ్య