Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నా.. వైద్యుడికి పాజిటివ్.. ఎక్కడ..?

Advertiesment
Chilakadaguda
, బుధవారం, 24 మార్చి 2021 (20:28 IST)
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా పాజిటివ్ కేసులు నమోదవుతూనే వున్నాయి. రెండో డోసు తీసుకున్నా కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఇలాంటి కేసు నమోదైంది. రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత చిలుకలగూడ రైల్వే డిస్పెన్సరీ వైద్యుడికి కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం సృష్టిస్తోంది.
 
బాధితుడిలో వున్నది యాక్టివ్ వైరసా.. లేదా ప్రాణాంతకమైందా అనే కోణంలో శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇటు వైరస్‌ నిర్ధారౖణెన వైద్యుడితో సన్నిహితంగా ఉన్న కుటుంబీకులు, సహోద్యోగులకు పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్‌ రావడం విశేషం. కాగా సదరు వైద్యుడు జనవరి మూడో వారంలో తొలి విడత.. తొలి డోసులో ‘కోవిషీల్డ్‌’వ్యాక్సిన్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత 28 రోజులకు అదే కంపెనీ వ్యాక్సిన్‌ను రెండో డోసు తీసుకున్నాడు. 
 
ఈ క్రమంలోనే విధి నిర్వహణలో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. అయితే జలుబు, జ్వరంతో బాధ పడుతుండటంతో ఇటీవల పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది. నిజానికి రెండు డోసులు తీసుకున్న రెండు వారాల తర్వాత పూర్తి స్థాయిలో యాంటీబాడీలు వృద్ధి కావాల్సి ఉంది. కానీ ఆ వైద్యుడికి ఆ నిర్దేశిత గడువు ముగిసినప్పటికీ కోవిడ్‌గా తేలింది. 
 
దీంతో వ్యాక్సిన్‌ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి టీకా తీసుకున్న 90 రోజుల వరకు రిస్క్‌ ఉంటుందని, అప్పటివరకు స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిందేనని, తయారీ కంపెనీలతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ పదే పదే స్పష్టం చేస్తూనే ఉంది. కానీ చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్తూనే వున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2 లక్షల దొంగ ఓటర్ కార్డులున్నాయి, బయట పెడతాం: బిజెపి