Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకే మాస్క్ 2 నుంచి 3 వారాలు వాడితే బ్లాక్ ఫంగస్ వచ్చే ఛాన్స్!

Advertiesment
black fungus
, బుధవారం, 26 మే 2021 (10:45 IST)
కొవిడ్-19 వైరస్‌తో ఇండియా పోరాడుతున్నది. కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా సరిపడా సప్లయ్ లేకపోవడంతో దేశంలో కొవిడ్ వ్యాప్తి విస్తారంగా జరుగుతోంది. దీనికి తోడు కొత్త కొత్త వైరస్‌లు వెలుగులోకి వస్తున్నాయి.

మనదేశంలో కొవిడ్‌తో పాటు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కొత్త రకం వేరియంట్లు వెలుగుచూడటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ వేరియంట్ రావడానికి అధికమోతాదులో స్టెరాయిడ్స్ వాడకం కారణమని వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఎయిమ్స్ వైద్యులు బ్లాక్ ఫంగస్‌కు అభివృద్ధి చెందడానికి గల కారణాలను వివరించారు.
 
కొవిడ్-19 రోగులలో నివేదించబడుతున్న బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ 'మ్యూకోమైకోసిస్ కొత్తది కాదని, అయితే ఇది అంటువ్యాధి నిష్పత్తిలో ఇంతకు ముందెన్నడూ జరగలేదని ఎయిమ్స్ న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ పి శరత్ చంద్ర తెలిపారు.

మ్యూకోర్మైకోసిస్ సంక్రమణకు కారణాలపై డాక్టర్ చంద్ర మాట్లాడుతూ.. ''రెండు నుంచి మూడు వారాల పాటు ఒకే మాస్క్‌ను క్రమంగా ఉపయోగించడం బ్లాక్ ఫంగస్ అభివృద్ధికి ఒక అమరికకు దారితీయవచ్చునని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబుల్ మాస్కులు ఎలా వాడాలి?