పిల్లల ఫ్యాషన్ పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. పాఠశాలలు ఓపెన్ కావడంతో స్కూల్ డ్రెస్‌లు నీట్‌గా పక్కాగా వుండేలా చూసుకోవాలి. టై నుంచి షూ వరకు పక్కాగా అమరిపోయేలా చూసుకోవాలి. వాషింగ్-ఐరనింగ్ కరెక్ట్‌గా వుండాలి.
ఇక ఇంట్లో వేసుకునే డ్రెస్‌ల నుంచి పార్టీ వేర్ వరకు పిల్లల ఛాన్స్‌కు ప్రాధాన్యత రంగులను ఎంపిక చేయాలి. మ్యాచింగ్-మ్యాచింగ్ రూట్‌కు వెళ్లడం మంచి విషయం.
పాఠశాలలకు వెళ్లేటప్పుడు పిల్లలు ఉపయోగించే బూట్లు లెదర్‌గా వుండేలా చూసుకోవాలి. పార్టీవేర్‌కు మ్యాచింగ్ యాక్ససరీ చేయడానికి భయపడవద్దు.
అమ్మాయిలకు, అబ్బాయిలకు ట్రెండ్ డ్రెస్సులు కూడా కొనిపెట్టండి. ఇలా చేస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. కాలానికి తగినట్లు పిల్లలు వస్త్రధారణలో మెరుగవవుతారు.