Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రెషర్స్‌కి ఇక పండగే, నాలుగు దిగ్గజ ఐటీ కంపెనీల్లో లక్ష ఉద్యోగాలు

Advertiesment
ఫ్రెషర్స్‌కి ఇక పండగే, నాలుగు దిగ్గజ ఐటీ కంపెనీల్లో లక్ష ఉద్యోగాలు
, బుధవారం, 27 అక్టోబరు 2021 (15:08 IST)
గత ఏడాది భారతదేశాన్ని కుదిపేసిన వినాశకరమైన కోవిడ్ మహమ్మారి కారణంగా ఐటీ రంగం కుదేలైంది. భారీ ఉద్యోగ నష్టాన్ని సృష్టించింది. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో, ఐటి రంగంలో ఉద్యోగాల నియామకాలు పెరుగుతున్నాయి. నాలుగు ప్రధాన సర్వీస్ ప్రొవైడర్లైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, HCL టెక్నాలజీస్ లక్ష మందికి పైగా ఫ్రెషర్లను రిక్రూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 
కంపెనీలు తమ నియామక అంచనాలను వేగవంతం చేశాయని, FY 22 రెండవ త్రైమాసికంలో 50,000 మందిని చేర్చుకున్నాయని, ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నియామకాల సంఖ్య లక్షకు పైగా (1,02,517) చేరిందని నివేదికలు తెలిపాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ భారతదేశంలోని మొత్తం శ్రామికశక్తిలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి.

 
తాము గత ఆరు నెలల్లో రికార్డు స్థాయిలో 43,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌లను చేర్చుకున్నట్లు TCS ఈ వారం ప్రారంభంలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మరో 35,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌లకు ఉపాధి కల్పిస్తామని, తద్వారా మొత్తం ఆర్థిక సంవత్సరంలో 78,000 మందిని నియమించుకుంటామని కంపెనీ ప్రకటించింది.

 
మరోవైపు, HCL టెక్నాలజీస్ ఈ సంవత్సరం కళాశాల క్యాంపస్‌ల నుండి దాదాపు 22,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌లకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది 30,000 మంది ఫ్రెషర్‌లను ఆన్‌బోర్డ్ చేయాలని కూడా చూస్తోంది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అట్రిషన్ రేటు జూన్ చివరి నాటికి 13.9 శాతం నుంచి 20.1 శాతానికి పెరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో గంజాయి సాగు సామాజిక ఆర్థిక అంశం : పవన్ కళ్యాణ్