Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

`సోని లివ్`కంటెంట్ హెడ్ గా మధుర శ్రీధర్ రెడ్డి

Advertiesment
Sony Live OTT
, బుధవారం, 16 జూన్ 2021 (16:58 IST)
Sridhar Reddy
టాలీవుడ్ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డికి మరో అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ ఎంటర్ టైన్ మెంట్ లో పేరున్న కంపెనీ సోని. తన ఓటీటీ విభాగం "సోని లివ్" తెలుగు కంటెంట్ హెడ్ గా మధుర శ్రీధర్ రెడ్డిని నియమించుకుంది. తమ ఓటీటీలో వర్సటైల్ తెలుగు కంటెంట్ను పెంచేందుకు శ్రీధర్ రెడ్డి అనుభవం, త‌ప‌న బాగా ఉపయోగపడతాయని సోని లివ్ మేనేజ్ మెంట్ గట్టి నమ్మకంతో ఉంది. ఈ సందర్భంగా సంస్థ‌ హెడ్ ఆశిష్ గోల్వాకర్ మాట్లాడుతూ., శ్రీ‌ధ‌ర్‌కున్న అనుభవంతో వీక్షకులకు నచ్చే వైవిధ్యమైన కంటెంట్ ను "సోని లివ్" కు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. అన్ని వర్గాల వీక్షకులు ఇష్టపడేలా "సోని లివ్" ను శ్రీధర్ రెడ్డి డెవలవ్ చేస్తారని నమ్మకం ఉంది. అన్నారు.
 
మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, విశ్వవ్యాప్త వినోద రంగంలో సోని ఒక దిగ్గజ సంస్థ. ఇలాంటి సంస్థ ఓటీటీ "సోని లివ్"తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. అందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా వినోద రంగంలో "సోని లివ్" కు ఉన్న లెగసీని తెలుగులో మరింత ముందుకు తీసుకెళ్తేందుకు ప్రయత్నిస్తాను. మన తెలుగులోని వైవిధ్యమైన కంటెంట్ ను దేశవ్యాప్తంగా ఆడియెన్స్ ఆదరించేలా తీసుకొస్తాం. అన్నారు.
 
మధుర శ్రీధర్ రెడ్డి ఐఐటీ మద్రాస్ లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్ర కంపెనీల్లో పనిచేశారు. సినీ రంగం మీద ఆసక్తితో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మధుర శ్రీధర్ రెడ్డి గత 11 ఏళ్లుగా టాలీవుడ్ లో దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, మ్యూజిక్ లేబుల్ ఓనర్ గా, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయనది క్రియేటివ్ జర్నీ గా చెబుతుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంకితాకు ప్ర‌పంచంలోనే అత‌నే బెస్ట్ బోయ్ ఫ్రెండ్ అట‌