Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్మయోగి రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించిన ట్రైడెంట్ గ్రూప్

Advertiesment
Students

ఐవీఆర్

, బుధవారం, 15 జనవరి 2025 (19:52 IST)
ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన సంస్థగా గుర్తింపు పొందిన ట్రైడెంట్ గ్రూప్.. ఇప్పుడు భారతదేశం అంతటా 3000 మంది నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా భారతదేశం మొత్తం కర్మయోగి రిక్రూట్ మెంట్ డ్రైవ్ ని మొదలుపెట్టింది. సమాజ అభివృద్ధికి ట్రైడెంట్ గ్రూప్ ఎప్పుడూ ముందుటుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించింది. ఇప్పుడు ఈ కర్మయోగి రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా... సాధికారత కలిగిన సమాజాన్ని నిర్మించడానికి, దేశం యొక్క సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడటానికి తనకున్న నిబద్ధతను మరోసారి చాటిచెప్పినట్లు అయ్యింది.
 
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్... మధ్యప్రదేశ్(బుధ్ని), పంజాబ్(ధౌలా మరియు సంఘేరా) లపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. అన్నింటికి మించి మహిళా అభ్యర్థులు, క్రీడా నేపథ్యాల నుండి వచ్చిన అభ్యర్థులపై దృష్టి పెడుతుంది. 3,000+ వ్యక్తులకు ఉపాధి కల్పించడం ద్వారా, ట్రైడెంట్ గ్రూప్ పరోక్షంగా 15,000 మంది కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూరుస్తుంది. తద్వారా ప్రజల జీవన నాణ్యతను మెరుగుర్చి జాతీయ GDP మరింతగా పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది, మహిళా సభ్యులకు సాధికారత కల్పిస్తుంది, విలువైన పన్ను ఆదాయాన్ని సృష్టిస్తుంది.
 
ఈ సందర్భగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి సీహెచ్ ఆర్ వో ట్రైడెంట్ గ్రూప్ శ్రీ పూజా లూత్రా మాట్లాడుతూ, “కర్మయోగి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా వేలాది మందికి పని అవకాశాలను సృష్టించాలనే మా దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. అదే సమయంలో మేము సేవలందిస్తున్న కమ్యూనిటీలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ కార్యక్రమం మా శ్రామిక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, వ్యక్తులను శక్తివంతం చేయడం, వారు అభివృద్ధి చెందడానికి అవకాశాలను అందించడం ద్వారా దేశ నిర్మాణానికి - వికసిత్ భారత్ వైపు దోహదపడుతుంది.” అని అన్నారు.
 
రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సమర్పణ, ఆఫ్‌లైన్ అంచనా, నైపుణ్య మూల్యాంకనాలు ఉంటాయి. విజయవంతమైన అభ్యర్థులు ట్రైడెంట్ గ్రూప్ యొక్క ఆపరేషన్స్, ఇంజనీరింగ్, నిర్వహణ, పరిపాలనతో సహా వివిధ విభాగాలలో జాయిన్ అవుతారు. 8 గంటల పనిదినం కోసం నెలకు రూ. 50,000 ప్రారంభ జీతం అందిస్తా. ఇది గౌరవప్రదమైన వేతనాలు, మెరుగైన పని-జీవిత సమతుల్యతను నిర్ధారిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో, ట్రైడెంట్ గ్రూప్ తాను సేవలందిస్తున్న కమ్యూనిటీలపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి తన అంకితభావాన్ని మరోసారి చాటిచెప్పినట్లు అయ్యింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో మోటోకార్ప్ సరికొత్త డెస్టినీ 125 విడుదలతో 125cc స్కూటర్ సెగ్మెంట్‌