దేశంలోని నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. దేశ వ్యాప్తంగా 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకోసం నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేయనుంది.
రైల్వే శాఖ భర్తీ చేయనున్న ఉద్యోగ పోస్టుల్లో ట్రాక్‌మెన్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గార్డ్, పారామెడికల్ సిబ్బంది, నర్సులు తదితర పోస్టులు ఉన్నాయి. ఈ నెల 28 నుంచి మార్చి 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాల వారికి పది శాతం కేటాయించారు. కాగా రానున్న రెండేళ్ళలో రైల్వేల్లో లక్ష మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఖాళీలను కూడా తాజా నోటిఫికేషన్‌లో పొందుపరచనున్నారు. ఫీజు, పరీక్షా కేంద్రాలు తదితర వివరాలను నోటిఫికేషన్‌లో పేర్కొననున్నారు.