అండర్ గ్రాడ్యుయేట్ లేదా నీట్ యూజీ 2023 కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష 2023 మే 7న జరగనుంది.
విద్యార్థులు తమ నీట్ అడ్మిట్ కార్డు/ హాల్ టికెట్‌ను అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో తమ 'అప్లికేషన్ నంబర్', 'డేట్ ఆఫ్ బర్త్' లాగిన్ చేయడం ద్వారా నీట్ అడ్మిట్ కార్డును యాక్సెస్ చేసుకోవచ్చు.
షెడ్యూల్ ప్రకారం, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, నీట్ యుజి పరీక్ష 2023 మే 07 (ఆదివారం) మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 05:20 గంటల వరకు దేశ వ్యాప్తంగా జరుగనుంది.