Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీట్ దరఖాస్తు గడవు పొడగింపు - మే 7న నీట్ ప్రవేశ పరీక్ష

neet exam
, మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (10:02 IST)
దేశంలోని వైద్య కాలేజీల్లో ఉన్న సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష జాతీయ ప్రవేశ అర్హత పరీక్ష (ఎన్.ఈ.ఈ.టి) గడువు తేదీని మరోమారు పొడగించారు. నిజానికి ఈ యేడాది నీట్ గడువు ఈ నెల ఆరో తేదీతో ముగిసింది. అయితే, అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ... మరోమారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందులోభాగంగా, ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. 
 
ఏప్రిల్ 13వతేదీ రాత్రి 11.30 గంటల వరకు నీట్ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. రాత్రి 11.59 గంటల వరకు ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చని వెల్లడించింది. neet.nta.nic.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అటు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తమ దరఖాస్తుల్లో తప్పొప్పులను సరిచేసుకునేందుకు కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) కరెక్షన్ విండోను కూడా అందుబాటులోకి తెచ్చింది. 
 
మే 7వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ప్రాంతీయ భాష అయిన తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రాల సమాచారం తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష కోసం దేశ వ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో నీట్ పరీక్షను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21 నుంచి ఏపీ సీఎం జగన్ దంపతుల లండన్ పర్యటన