Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.15 కోట్లతో ఐఐటీ-కాన్పూర్ విద్యార్థికి మైక్రోసాఫ్ట్ కళ్లు చెదిరే ఆఫర్

ఐఐటీ కాన్పూర్‌ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - కాన్పూర్) విద్యార్థికి మైక్రోసాఫ్ట్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఢిల్లీకి చెందిన ఈ విద్యార్థికి శుక్రవారం నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలో సంవత్సరానిక

రూ.15 కోట్లతో ఐఐటీ-కాన్పూర్ విద్యార్థికి మైక్రోసాఫ్ట్ కళ్లు చెదిరే ఆఫర్
, ఆదివారం, 4 డిశెంబరు 2016 (15:51 IST)
ఐఐటీ కాన్పూర్‌ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - కాన్పూర్) విద్యార్థికి మైక్రోసాఫ్ట్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఢిల్లీకి చెందిన ఈ విద్యార్థికి శుక్రవారం నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలో సంవత్సరానికి రూ.1.5 కోట్లను వార్షిక వేతనంగా చెల్లించేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. 
 
ఐఐటీ కాన్పూర్‌ చరిత్రలో ఓ విద్యార్థి ఇంత మొత్తంలో వార్షిక వేతనంగా అందుకోవడం ఇదే తొలిసారి. గత ఏడాది నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఓ విద్యార్థి రూ.93 లక్షలు వార్షిక వేతనంగా అందుకున్నాడు.
 
అయితే, ఈ యేడాది 200 కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ముందుకొచ్చాయి. వీటిలో ఓలా, ఉబెర్‌, పేటీఎం, అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ సేవలందించే సంస్థలు కూడా ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుల్లితెర నటిని లూటీ చేశారు... బెదిరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి...