Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌- వైజాగ్‌ల నుంచి 7500 విదేశీ విద్యా ఋణ దరఖాస్తులను అందుకున్న జ్ఞాన్‌ధన్‌

హైదరాబాద్‌- వైజాగ్‌ల నుంచి 7500 విదేశీ విద్యా ఋణ దరఖాస్తులను అందుకున్న జ్ఞాన్‌ధన్‌
, శుక్రవారం, 25 మార్చి 2022 (00:08 IST)
భారతదేశపు మొట్టమొదటి డిజిటల్‌ విద్యా ఫైనాన్సింగ్‌ వేదిక మరియు ఎన్‌బీఎఫ్‌సీ తమ కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి దాదాపు 7వేల విదేశీ విద్యా ఋణ దరఖాస్తులను హైదరాబాద్‌ నుంచి మరియు 500 దరఖాస్తులను వైజాగ్‌ నుంచి పొందింది. ఈ ఋణాలలో అధికశాతం యుఎస్‌ఏ, యుకె, కెనడా, ఆస్ట్రేలియా మరియు జర్మనీ దేశాలో ్ల ఎంఎస్‌ మరియు ఎంటెక్‌  వంటి పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ స్థాయి కోర్సులతో పాటుగా ఇంజినీరింగ్‌/టెక్నాలజీ వంటి అండర్‌గ్రాడ్యుయేట్‌ స్ధాయి కోర్సుల కోసం వెళ్తున్నారు.
 
2016లో హైదరాబాద్‌ నగరంలో దాదాపు 300 ఋణ దరఖాస్తులు లభించాయి.  అదే సమయంలో వైజాగ్‌లో 50 ఋణ దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్‌ నగరంలో 9 మిలియర్‌ డాలర్ల కోసం అభ్యర్థిస్తే, వైజాగ్‌ నుంచి 2 మిలియన్‌ డాలర్లను   అభ్యర్థించారు.  అనంతర కాలంలో ఇది వేగంగా వృద్ధి చెందింది.  2021లో ఋణాల కోసం వచ్చిన అభ్యర్థనలు రాకెట్‌ వేగంతో దూసుకువెళ్లాయి. హైదరాబాద్‌లో ఈ సంవత్సరం 103 మిలియన్‌ యుఎస్‌ డాలర్ల  ఋణాలను కోరితే వైజాగ్‌ నుంచి 5 మిలియన్‌ డాలర్లను కోరుకున్నారు. తద్వారా హైదరాబాద్‌లో మొత్తంమ్మీద 250 మిలియన్‌ డాలర్లు మరియు వైజాగ్‌ నంచి 7 మిలియన్‌ డీలర్ల ఋణాల కోసం అభ్యర్ధనలు వచ్చాయి.
 
వీటిలో  అత్యధికంగా అప్లికేషన్‌లు అందుకున్న యూనివర్శిటీలలో  అల్గోన్క్విన్‌  కాలేజీ (కెనడా),  ఏంజిలియా రస్కిన్‌ యూనిర్శి టీ (యుఎస్‌ఏ), బర్మింగ్‌ హామ్‌ సిటీ యూనివర్శిటీ  (యుకె), కాలిఫోర్నియా  స్టేట్‌ యూనివర్శిటీ  , కార్నీజ్‌ మెల్లన్‌ యూనివర్శిటీ (యుఎస్‌ఏ), కాంటినెంటల్‌ కాలేజీ (కెనడా), టీయు మునిచ్‌ (జర్మనీ) వంటివి ఎక్కువ మంది ప్రాధాన్యతనిచ్చిన యూనివర్శిటీ ల జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్‌ మరియు వైజాగ్‌ నుంచి ఈ యూనివర్శిటీలకు ఎక్కువ మంది హాజరవుతున్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలలో పలువురు అడ్మిషన్‌ కన్సల్టెంట్లతో  జ్ఞాన్‌ ధన్‌ అతి సన్నిహితంగా పనిచేయడంతో పాటుగా అతి సులభంగా విద్యా ఋణాలను అందిస్తుంది.  అత్యధిక శాతం దరఖాస్తులను మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ కోసం అందుకుంది.  దాదాపుగా అందుకున్న మొత్తం దరఖాస్తులలో 60% ఇవే ఉంటున్నాయి. ఆ తరువాత  అందుకుంటున్న దరఖాస్తులలో పీజీ డిప్లమో మరియు అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు ఉంటున్నాయి. లింగ నిష్పత్తి పరంగా  చూసినప్పుడు అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ 33% నుంచి 35%తో అతి తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అత్యధిక శాతం మంది ఉన్నత విద్య కోసం  ఋణాలను ఇష్టపడున్నారు. 
 
జ్ఞాన్‌ధన్‌  కో–ఫౌండర్‌ అండ్‌ సీఈవో  అంకిత్‌  మెహ్రా మాట్లాడుతూ ‘‘చారిత్రాత్మకంగా,  ఆంధ్రప్రదేశ్‌లోని అత్యధిక శాతం మంది విద్యార్థులు యుఎస్‌ఏలో ఉన్నత విద్య కోసం అమితంగా ఇష్టపడుతుంటారు. ఈ ధోరణులలో ఇటీవలి కాలంలో  మార్పులు కనిపిస్తున్నాయి. యుకె, కెనడా, ఆస్ట్రేలియా లకు కూడా ఎక్కువగానే వెళ్తున్నారు. అతి సులభంగా ఋణాలను, మెరుగైన ఋణ ప్రక్రియ కు అందించడం కోసం గ్రూప్‌ లోన్‌ ఉత్పత్తిని జ్ఞాన్‌ ధన్‌  ఆవిష్కరించింది. విద్యార్థులు జ్ఞాన్‌ధన్‌ యొక్క సౌకర్యవంతమైన ఋణ ప్రక్రియతో పాటుగా ఖచ్చితమైన క్యాష్‌బ్యాక్‌ను గెలుపొందవచ్చు. దీనితో తమ గమ్య స్థానాలకు విమాన టిక్కెట్లను సైతం పొందవచ్చు’’ అని అన్నారు.
 
జ్ఞాన్‌ధన్‌ వద్ద ఋణాలను పొందే ప్రక్రియను సరళతరం చేశారు. దీనికోసం మార్కెట్‌లో పలు అగ్రగామి ఋణదాతలతో భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా తమ వినియెగదారుల ఋణ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసింది.  ఈ ప్రక్రియను న్యాయమైన మరియు మెరిటోక్రాటిక్‌  పద్ధతిలో చేసేందుకు వారు అంతర్గత క్రెడిట్‌ స్కోర్‌ నమూనాను నిర్మించారు. దీనినే జ్ఞాన్‌ధన్‌ స్కోర్‌  అంటున్నారు. విద్యార్థుల విద్యా రికార్డులు, ప్రొఫెషనల్‌ ఎావ్‌మెంట్స్‌,  భావి సంపాదన సామర్థ్యం, లక్ష్యత కోర్సు మరియు దేశం ఆధారంగా వీరు విద్యార్థులకు స్కోర్‌ అందిస్తారు.   ఇది అవాంఛిత ఋణ అర్హత  ప్రమాణాలను తొలిగిస్తుంది. అంటే సంప్రదాయ ఋణదాతలు వినియోగించే తనఖాలను భిన్నంగా ఇది ఉంటుది. ఈ ఋణ మొత్తాన్ని పూర్తిగా దరఖాస్తు చేసిన వారి ప్రొఫైల్‌ ఆధారంగా నిర్ఫయిస్తారు. దీని కారణంగా తనఖా పెట్టే స్థోమత లేని విద్యార్థులు సైతం ఋణాలను పొదడం సులభతరమవుతుంది.
 
ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం, విదేశీ విద్యను ఎంచుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016లో వీరి సంఖ్య 4,40,000 ఉంటే 2019 నాటికి అది 7,70,000కు  చేరింది.2014 నాటికి ఇది దాదాపు 18 లక్షల మందికి చేరువ కావొచ్చు.  ఉన్నత విద్యపై విదేశీ విద్య ఖర్చులు పెరగడం దీనికి ఓ కారణం. అదే సమయంలో దేశీయంగా 2016లో 37 మిలియన్‌గా ఉన్న వారి సంఖ్య 2019 నాటికి 40 మిలియన్‌లకు చేరుకుంది.
 
భారతదేశం లోపల ఏ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు ఉన్నత విద్య కోసం వెళ్తున్నారన్నది  చూస్తే, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, మహారాష్ట్ర  ముందు వరుసలో ఉంటున్నాయి. భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రాలుగా ఇవి నిలుస్తున్నాయి. వీటికి తోడు విద్యా ప్రయోజనాల పట్ల వీరికి అవగాహన కూడా అధికంగా ఉంది. ఇటీవలి కాలంలో భారతదేశం నుంచి ఇతర దేశాలకు విద్య కోసం వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడానికి అత్యుత్తమ విద్యా నాణ్యత , విదేశాల్లో మెరుగైన ఫలితాలు, అత్యున్నత  జీవన ప్రమాణాలు, భారతీయ విద్యావ్యవస్థలో అంతరాలు కారణంగా డిమాండ్‌ –సరఫరా  అసమతుల్యత పెరగడం, భారతీయ కుటుంబాల ఆదాయం పెరగడం వంటివికారణాలుగా కనిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేషన్ ఆధార్ కార్డ్ లింక్ : జూన్ 30 వరకు పొడిగింపు