సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫస్ట్ టర్మ్ ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. అయితే, ఈ ఫలితాలను కేవలం ఆఫ్‌లైన్‌లో మాత్రమే రిలీజ్ చేశారు. ఆన్‌లైన్‌లో ఇంకా విడుదల చేయలేదు. విద్యార్థులకు సంబంధించిన మార్కుల జాబితాలను ఆయా స్కూల్స్‌కు పంపించినట్టు సీబీఎస్ఈ బోర్డు ఒక ట్వీట్‌లో పేర్కొంది.
పదో తరగతి థియరీ పేపర్లకు సంబంధించిన ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులు తమ స్కూళ్లను సంప్రదించాలని సూచించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://cbseresults.nic.in/ లో ఇంకా ప్రకటించలేదు. ఇందులో త్వరలోనే అప్‌లోడ్ చేస్తామని తెలిపింది. ఆన్‌లైన్ ఫలితాలు ప్రకటించిన తర్వాత https://results.gov.in/ లేదా https://www.digilocker.gov.in/ లో కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని పేర్కొంది.