Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘ఇంపాక్ట్ఎక్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’ను ప్రారంభించిన ఆక్సిలో ఫిన్‌సర్వ్

Advertiesment
students

ఐవీఆర్

, బుధవారం, 5 మార్చి 2025 (17:38 IST)
విద్యపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన NBFC అయిన ఆక్సిలో ఫిన్‌సర్వ్, సమాజంలోని ఆర్థికంగా బలహీనమైన విభాగం (EWS)కి చెందిన విద్యార్థుల కోసం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, నైపుణ్యాలను పెంచే కోర్సులకు వార్షిక విద్యా ఖర్చుకు నిధులు సమకూర్చే లక్ష్యంతో తమ విద్య-ఆధారిత స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ‘ఇంపాక్ట్ఎక్స్’ను ప్రకటించింది. ఇంపాక్ట్ఎక్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ప్రతి విద్యార్థికి రూ. 1,00,000 వరకు నిధులు సమకూరుస్తుంది.
 
ఆక్సిలో ఫిన్‌సర్వ్ సీఈఓ, ఎండి నీరజ్ సక్సేనా మాట్లాడుతూ, “ఏ దేశ అభివృద్ధికి అయినా విద్య ఒక నిర్మాణాత్మక అంశం. ఇంపాక్ట్ఎక్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌తో, అర్హులైన విద్యార్థులు కోరుకున్న విద్యను సాధించడానికి, వారి జీవితాలను మార్చడానికి తగిన అవకాశాలను నిర్మించడానికి, వారికి సాధికారత కల్పించడానికి మేము ప్రయత్నిస్తున్నాము” అని అన్నారు. ‘ఇంపాక్ట్ఎక్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’ సమాజంలోని ఆర్థికంగా బలహీనమైన విభాగం (EWS) కు చెందిన భారతీయ విద్యార్థుల కోసం తెరిచి ఉంది.
 
‘ఇంపాక్ట్ఎక్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’ ముఖ్యాంశాలు:
విద్యా ఖర్చులను కవర్ చేయడానికి ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ. 1,00,000 స్కాలర్‌షిప్
విద్యను అభ్యసించడానికి EWSకు చెందిన విద్యార్థులకు తెరిచి ఉంది.
 
అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, నైపుణ్యాన్ని పెంచే కోర్సులను అభ్యసించే విద్యార్థుల కోసం రూపొందించబడిన స్కాలర్‌షిప్
 
గత విద్యా సంవత్సరంలో కనీసం 55% మార్కులు సాధించడం లేదా ప్రణాళికాబద్ధమైన కోర్సుకు సంబంధించిన ముందస్తు విద్యను సంతృప్తికరంగా పూర్తి చేయడం
భారతదేశంలో విద్యను అభ్యసిస్తున్న 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ విద్యార్థులు ఈ  స్కాలర్‌షిప్ కు అర్హులు. 
 
అర్హులైన విద్యార్థులు auxilo.comని సందర్శించి అవసరమైన సమాచారాన్ని సమర్పించడం ద్వారా ఇంపాక్ట్ఎక్స్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పనిసరి చర్యగా, స్కాలర్‌షిప్‌ను ఆమోదించే ముందు కంపెనీ డేటా వెరిఫికేషన్ మరియు నేపథ్య స్క్రీనింగ్ కోసం  అర్హత గల ప్రతి దరఖాస్తుదారుని ఇంటి సందర్శనలతో సమీక్షిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రేమికుడు