Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాక్‌డౌన్‌తో క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి దారుణం.. సొంత గ్రామాలకు..

లాక్‌డౌన్‌తో క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి దారుణం.. సొంత గ్రామాలకు..
, గురువారం, 20 మే 2021 (17:52 IST)
లాక్‌డౌన్‌తో క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ కంపనీల నుండే క్యాబ్‌ డ్రైవర్లకు ఉపాధి లభిస్తోంది. కరోనాతో ఫస్ట్ వేవ్ నుంచే సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ డ్యూటీస్ అమలు చేస్తూ వస్తున్నాయి. దీంతో అన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు తమ కంపెనీల్లో క్యాబ్‌లను తొలగించాయి. 
 
ఫలితంగా ఆ క్యాబ్ ఓనర్లు, డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది. క్యాబ్‌లు నడిపే వారిలో.. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని సొంతంగా నడుపుకునే వారు ఎక్కువ. లాక్‌డౌన్‌తో క్యాబ్‌లు ఆగిపోవడంతో.. ఫైనాన్స్‌ కంపెనీలకు నెలవారీ కిస్తీలు కట్టలేకపోతున్నారు. దీనికి తోడు ఉపాధి కూడా లేకుండా పోవడంతో.. ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థితి.
 
లాక్‌డౌన్‌తో ఉన్న ఉపాధికి గండి పడటంతో.. క్యాబ్‌లపైనే ఆధారపడ్డ కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. బండి నడవకపోవడంతో.. వారి ఇల్లు గడవడమే కష్టంగా మారంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కొందరు సొంత గ్రామాలకు వెళ్లిపోగా.. మిగిలిన వారు సర్కార్ ఏమైనా సాయం చేయకపోదా అని ఎదురుచుస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజల ప్రాణాలపై ఏపీ రాష్ట్ర‌ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డికి ప్రేమో...!!