Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజల ప్రాణాలపై ఏపీ రాష్ట్ర‌ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డికి ప్రేమో...!!

Advertiesment
Andhra Pradesh
, గురువారం, 20 మే 2021 (17:38 IST)
ఎవరూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఎవరూ చనిపోలేదు. లక్షల రూపాయిలు మందుకి వసూలు చేయడంలేదు. అయినా సరే లోకాయుక్త జస్టీస్ లక్ష్మణరెడ్డి ప్రజాక్షేమం కోరో లేక వేరే కారణాలో ఎదైతేనేమి ఆపత్కాలంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ వచ్చిన కరోనా ఆయుర్వేద మందును పంపిణీ ఆపివేయించారు. 
 
నిజానికి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో రాష్ట్రంలో గతంలో ఉన్న బ్రాండ్లు కనుమరుగై నాసిరకం మధ్యం అధిక ధరలకి ప్రభుత్వం అమ్ముతుంది. దీని మీద లక్ష్మణరెడ్డి స్పందించలేదు. అన్ని బ్రాండులు అమ్మాలని ఆదేశాలు ఇవ్వలేదు. రేట్లు తగ్గించాలని ఆదేశాలు ఇవ్వలేదు. 
 
జగన్ సిఎం అయిన నాటి నుండి అత్యంత ఖరీదైన వ్యవహారం అయిపోయింది. 6 నెలలు ఇసుక సరఫరా ఆపేశారు. ఏనాడు లక్ష్మణరెడ్డి స్పందించలేదు. 
 
కరోనా రెండో దశలో ఆక్సిజన్ అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి రుయాలో పదుల సంఖ్యలో చనిపోయారు. లక్ష్మణరెడ్డి స్పందించలేదు. 
 
వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ కేసు.. లక్ష్మణరెడ్డి స్పందించలేదు. 
 
కానీ, 
 
ప్రజలకి ఉపయోగపడే మందు మీద ఆగమేఘాల మీద స్పందించారు. అది కూడా సుమొటోగా స్వీకరించారు. ఆ తర్వాత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కరోనా కష్టకాలంలో ఎంతోమంది ప్రాణాలు రక్షిస్తున్న కరోనా మందు పంపిణీని నిలివేయించిన ఘనత లోకాయుక్త లక్ష్మణ రెడ్డికే దక్కుతుందని విపక్షనేతలు, కరోనా రోగులు ఆరోపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో సరికొత్త ఫీచర్స్‌- గూగుల్