Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వింగ్స్ ఇండియా 2024లో ఏరోస్పేస్ ఎక్సలెన్స్‌ మెరుగుపరచిన వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్

Wings India 2024

ఐవీఆర్

, ఆదివారం, 28 జనవరి 2024 (22:07 IST)
గ్లోబల్ ఏవియేషన్, ఏరోస్పేస్ పరిశ్రమలో కీలకమైన కార్యక్రమం, వింగ్స్ ఇండియా 2024. ఆవిష్కరణ- సహకారాన్ని ప్రదర్శిస్తూ జనవరి 18 నుండి 21 వరకు ఇది హైదరాబాద్‌లో జరిగింది. వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్, క్రెసెండో వరల్డ్‌వైడ్ భాగస్వామ్యంతో, ఈ కార్యక్రమంను మహోన్నత శిఖరాలకు తీసుకువెళ్ళింది. 
 
వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ రాడి సిమియోనోవా మాట్లాడుతూ, భారతదేశం-వాషింగ్టన్ సంబంధాలు, వింగ్స్ ఇండియా 2024 యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. వాషింగ్టన్ స్టేట్ యొక్క ఏరోస్పేస్ హబ్ బలాలను ప్రదర్శించడంతో పాటుగా యుఎస్ విస్తరణ అవకాశాల గురించి భారతీయ వ్యాపారాల నుండి నేర్చుకోవడం పట్ల రాడి హర్షం వ్యక్తం చేశారు. యునైటెడ్ స్టేట్స్‌లో తమ ప్రవేశాన్ని, వృద్ధిని ఎలా సులభతరం చేయగలదో అర్థం చేసుకోవడంలో భారతీయ వ్యాపారాలకు సహాయం చేయడానికి క్రెసెండో వరల్డ్‌వైడ్‌తో భాగస్వామ్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. సియాటిల్‌లో మొదటి భారతీయ కాన్సులేట్‌ను ప్రారంభించడం ద్వారా మెరుగైన ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల కోసం వాషింగ్టన్ స్టేట్, భారతదేశం మధ్య ప్రత్యక్ష మార్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా 2024లో దౌత్య సంబంధాలను బలోపేతం చేసే ప్రణాళికలను కూడా రాడి ప్రస్తావించారు.
 
వింగ్స్ ఇండియా 2024లో గ్లోబల్ ఏవియేషన్ పరిజ్ఞానం బోయింగ్, ఎయిర్‌బస్ వంటి పరిశ్రమ దిగ్గజాల నుండి రాబోయే ప్రాజెక్ట్‌లను వెల్లడించారు. క్రెసెండో వరల్డ్‌వైడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విశాల్ జాదవ్, ఏరోస్పేస్, డిఫెన్స్ సహకారాలలో యునైటెడ్ స్టేట్స్, ఇండియాల మధ్య అంతర్గత సహకారాన్ని నొక్కి చెప్పారు. భారతదేశంలో రెండవ అతిపెద్ద ఇంజినీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సదుపాయాన్ని బోయింగ్ ఇటీవల ప్రారంభించడాన్ని ఆయన వెల్లడించారు. రెండు దేశాల నుండి చిన్న- మధ్యతరహా సంస్థల మధ్య సహకారం, వాషింగ్టన్, సియాటెల్‌కు భారతీయ ఏరోస్పేస్ కంపెనీల ప్రతినిధి బృందం పర్యటనను సులభతరం చేయడానికి జాదవ్ ప్రణాళికలను కూడా వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐక్యత, విజయంను వేడుకగా నిర్వహించిన ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ 2024