Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐక్యత, విజయంను వేడుకగా నిర్వహించిన ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ 2024

Inorbit Durgam Cheruvu Run 2024

ఐవీఆర్

, ఆదివారం, 28 జనవరి 2024 (21:59 IST)
ఐక్యత, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, సాధికారతను వేడుక చేస్తూ నిర్వహించిన ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ (ఐడిసిఆర్) 2024ను జనవరి 28, 2024న విజయవంతంగా నిర్వహించారు. ఐడిసిఆర్ 2024లో 6250 మంది ఉత్సాహపూరితమైన రన్నర్లు పాల్గొన్నారు. ఐడిసిఆర్ 2024లో అసాధారణమైన ఓర్పు, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, విష్ణు విట్టల్ రావు పురుషుల హాఫ్ మారథాన్ ఛాంపియన్‌గా నిలిచారు.
 
పట్టుదల, అథ్లెటిసిజం యొక్క స్ఫూర్తిని కలిగి ఉన్న ఉమా మరిపల్లి మహిళల హాఫ్ మారథాన్ విజేతగా నిలిచారు. 10 కి.మీ విభాగంలో, సాహిల్ అత్యంత వేగవంతమైన పురుషునిగా నిలిస్తే, అసమానమైన వేగం, చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ, 10 కి.మీ విభాగంలో అత్యంత వేగవంతమైన మహిళ టైటిల్‌ను బాధో కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు, LGBTQ+ కమ్యూనిటీకి చెందిన 100+ మంది వ్యక్తులు చురుకుగా పాల్గొనడం జరిగింది. ఐడిసిఆర్ 2024 NGO భాగస్వామిగా వున్న నిర్మాణ్‌‌తో కలిసి రూ. 60 లక్షలను సేకరించింది. PWDలు, LGBTQ+, మహిళల ఆర్థిక సాధికారత కోసం ఈ నిధులు ఉపయోగించబడతాయి.
 
ఐడిసిఆర్ 2024కు మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్ పార్టనర్‌గా మద్దతును కొనసాగించింది, ది వెస్టిన్ హాస్పిటాలిటీ పార్టనర్‌గా, కమల్ వాచ్ కో. ప్రైజ్ పార్టనర్‌గా, సెలబ్రేషన్ పార్టనర్‌గా ఫ్యూజన్9 అమ్నీసియా, గఠోరడే హైడ్రేషన్ సపోర్టును అందించింది, నిర్మాన్ ఆర్గ్ ఎన్జీఓ భాగస్వామిగా, ఫీవర్ FM రేడియో భాగస్వామిగా, మెడికవర్ హాస్పిటల్స్ మెడికల్ పార్టనర్‌గా తోడ్పాటు అందించాయి. ఐడిసిఆర్ 2024 మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్‌లో ముగిసే ముందు ఐకానిక్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీదుగా ప్రశాంతమైన దుర్గం చెరువు సరస్సుతో సహా సైబరాబాద్ యొక్క సుందరమైన ప్రకృతి దృశ్యాల ద్వారా ఉత్తేజకరమైన ప్రయాణాన్ని అందించింది.
 
ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ నుండి రన్ ను డాక్టర్ వినీత్ జి, ఐపిఎస్, డిసిపి సైబరాబాద్ పోలీస్, శ్రీమతి శిల్పవల్లి DCP సైబరాబాద్ పోలీస్, శ్రీ. స్నేహ శబరీష్ IAS, జోనల్ కమిషనర్, శేరిలింగంపల్లి తదితరులు ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదీలకు విభిన్న రుచులను పరిచయం చేస్తూ గుజరాతీ ఫుడ్ ఫెస్టివల్‌