Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో జరిగిన 9వ వార్షిక డబుల్స్ డైవ్‌లో సింక్రోనీ ఉద్యోగుల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు

Advertiesment
Synchrony employees

ఐవీఆర్

హైదరాబాద్ , మంగళవారం, 23 జనవరి 2024 (23:01 IST)
ఇండియా డబుల్స్ డైవ్ 2024 అనేది సెంట్రల్ రీజినల్ ఎంగేజ్‌మెంట్ హబ్ (హైదరాబాద్) కోసం వ్యక్తిగతంగా ఉద్యోగులు మాత్రమే హాజరయ్యే కార్యక్రమం. దీనిలో అన్ని ప్రాంతీయ ఎంగేజ్‌మెంట్ హబ్‌లు వర్చువల్‌గా పాల్గొనవచ్చు. హైదరాబాద్ వెలుపల నివసించే ఉద్యోగులు రంగుల నీరు, పువ్వులు లేదా కన్ఫెట్టిని ఉపయోగించి వర్చువల్ కలర్‌పాప్ ఛాలెంజ్‌లో చేరడానికి అవకాశం వుంది. ఈ కంపెనీ వ్యాప్త కార్యక్రమం వివిధ స్వచ్ఛంద సంస్థల కోసం డబ్బును సేకరించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ రోడ్‌లోని నోవోటెల్ గార్డెన్స్‌లో కార్యక్రమం చేశారు. దీనిలో 405+ మంది ఉద్యోగులు వ్యక్తిగతంగా హాజరయ్యారు.
 
ఈ సంవత్సరం డబుల్స్ డైవ్ (వ్యక్తిగతంగా లేదా వర్చువల్)లో పాల్గొనే ప్రతి ఉద్యోగి భారతదేశంలోని అల్పాదాయ వర్గాల నుండి 2200+ నిరుపేద పిల్లలకు ప్రయోజనం చేకూర్చే 'డిజిటల్ కరికులం డెవలప్‌మెంట్ హబ్ మరియు వర్చువల్ ట్రైనింగ్ స్టూడియో'ని రూపొందించడానికి యు&ఐ ట్రస్ట్ యొక్క ప్రోగ్రామ్‌కు మద్దతు ఇస్తారు. 2011లో ఏర్పాటైన యు&ఐ ట్రస్ట్, విద్య, పర్యావరణం మరియు ప్రత్యేక అవసరాల పునరావాస రంగాలలో మార్పు కోసం కమ్యూనిటీలను నిర్మించే ప్రభావ ఉద్యమం. దీని కోసం, వారు యు&ఐ టీచ్, యు&ఐ కేర్, యు&ఐ ఎంపవర్, యు&ఐ ఇగ్నైట్ అంటూ నాలుగు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్లోబల్ ఏరోస్పేస్ సప్లై చైన్‌: హైదరాబాద్‌లో Jeh ఏరోస్పేస్ తయారీ కేంద్రం