Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంపాదన, ఖర్చు, పొదుపుపై అపర కుబేరుడు వారెన్ బఫెట్

అపర కుబేరుడు వారెన్ బఫెట్ ఆదాయ మార్గాలు, సంపాదన, ఖర్చు తదితర విషయాలపై చెప్పిన మాటలు కొన్ని. సంపాదన: ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడకండి. ప్రత్యామ్నాయంగా మరో ఆదాయ మార్గం కోసం పెట్టుబడులు పెట్టండి.

Advertiesment
సంపాదన, ఖర్చు, పొదుపుపై అపర కుబేరుడు వారెన్ బఫెట్
, శుక్రవారం, 5 జనవరి 2018 (12:34 IST)
అపర కుబేరుడు వారెన్ బఫెట్ ఆదాయ మార్గాలు, సంపాదన, ఖర్చు తదితర విషయాలపై చెప్పిన మాటలు కొన్ని.
సంపాదన: ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడకండి. ప్రత్యామ్నాయంగా మరో ఆదాయ మార్గం కోసం పెట్టుబడులు పెట్టండి.
 
ఖర్చు: మీకు అవసరం లేని వస్తువులను కొంటూ పోతే, కొద్ది రోజులలో అవసరమైన వస్తువులను అమ్ముకునే పరిస్థితి నెలకొంటుంది.
 
పొదుపు: ఖర్చు చేసాక మిగిలే మొత్తాన్ని ఆదా చేయకూడదు, ముందు కొంత మొత్తాన్ని ఆదా చేసాక మిగిలినది ఖర్చు పెట్టుకోండి.
 
రిస్కు తీసుకోవడం: నది లోతు కొలవడానికి ఒక కాలిని నీటిలో పెట్టాలి, అంతేకానీ పూర్తిగా దిగకూడదు.
 
పెట్టుబడులు: అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకుండా వేర్వేరు బుట్టలలో పెట్టడం మంచిది.
 
ఆశించకూడనివి: నిజాయితీ అనేది అత్యంత ఖరీదైన బహుమతి. చౌకబారు వ్యక్తుల నుండి దీనిని ఆశించకండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజినీకాంత్ కూడా తెలుగువారిని....